top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 849 / Sri Siva Maha Purana - 849


🌹 . శ్రీ శివ మహా పురాణము - 849 / Sri Siva Maha Purana - 849 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 31 🌴


🌻.బ్రహ్మవిష్ణువులకు శివుని ఉపదేశము - 4 🌻


శ్రీశివుడిట్లు పలికెను- ఓ కృష్ణా! గోపీ వల్లభా! భయమును వీడి స్వస్థుడవు కమ్ము. వత్సా! అను గ్రహబుద్ధి గల నాచే ఈ సర్వము చేయబడినది (29). నీకు మంగళము కలుగగలదు. ఉత్తమమగు నీ స్థానమునకు వెళ్లి, నిత్యము సావధానుడవై నీ కర్తవ్యమును నిర్వహించుము (30). నేను పరాత్పరుడనని యెరింగి యథేచ్ఛగా విహరించుము. రాధతో మరియు అనుచరులతో గూడి నిశ్చింతగా నీ కర్తవ్యమును చేయుము (31). శ్వేతవరాహ కల్పములో రాధాసుందరితో గూడి శాపప్రభావమునను భవించి మరల నీ స్థానమును చేరగలవు (32). ఓ కృష్ణా! నీకు పరమ ప్రియుడు, అనుచరుడునగు సుదాముడు ఇపుడు దానవుడై జన్మించి జగత్తును కష్టపెట్టుచున్నాడు (33). రాధయొక్క శాపప్రభావముచే దేవతలకు శత్రువు అగు దానవుడై జన్మించి శంఖచూడుడను పేరుతో ప్రసిద్ధిని గాంచినాడు (34). వానిచే నిత్యము పీడింపబడి బయటకు త్రోసివేయబడిన ఇంద్రాది దేవతలు అందరు తమ అధికారములను గోల్పోయి వికృతరూపములతో పదిదిక్కులకు తరలి వెళ్లినారు (35). వారి కొరకై బ్రహ్మవిష్ణువులు ఇచటకు వచ్చి నన్ను శరణు పొందినారు. నేను నిస్సందేహముగా వారి కష్టములు తొలగించగలను (36).


సనత్కుమారుడిట్లు పలికెను - శంకరుడు శ్రీకృష్ణునితో నిట్లు పలికి మరల బ్రహ్మవిష్ణువులను సాదరముగా సంబోధించి దుఃఖమును పోగొట్టే వచనము నిట్లు పలికెను (37).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 849 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 31 🌴


🌻 Śiva’s advice to Viṣṇu and Brahmā - 4 🌻



Lord Śiva said:—


29. “O Kṛṣṇa, O lord of cowherdesses leave off your fear. Be happy. O dear, all this has been brought about by me with blessing in disguise.


30. Good will befall you. Go back to your excellent abode. You shall be cautious and guarded in your position of authority.


31. Sport about as you please after realising me the greater than the greatest. Accompanied by Rādhā and your comrades carry out your task unexasperated and unfluttered.


32. In the excellent Vārāha Kalpa,[1] you shall undergo the effect of the curse along with the young damsel Rādhā and then attain your region.


33. O Kṛṣṇa, your comrade, the most beloved Sudāmā is born of a Dānava now and he harasses the universe.


34. He has become a Dānava, an enemy of the gods, named Śaṅkhacūḍa as a result of the power of Rādhā’s curse. He hates and belongs to the party of Daityas.


35. Divested of their powers, ousted and harassed by him for ever, the demoralized gods including Indra have fled to the ten directions.


36. It is for their sake that Brahmā and Viṣṇu have come here and sought refuge in me. There is no doubt in this that I will relieve them of their distress.”



Sanatkumāra said:—


37. After saying this, he addressed Kṛṣṇa again eagerly after consoling Viṣṇu and Brahmā with words that quelled their agony.



Continues....


🌹🌹🌹🌹🌹



0 views0 comments

Comments


bottom of page