top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 850 / Sri Siva Maha Purana - 850


🌹 . శ్రీ శివ మహా పురాణము - 850 / Sri Siva Maha Purana - 850 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 31 🌴


🌻. బ్రహ్మవిష్ణువులకు శివుని ఉపదేశము - 5 🌻


శివుడిట్లు పలికెను- ఓ హరీ! ఓ బ్రహ్మా! నా ఈ మాటను ప్రీతితో వినుడు. కుమారులారా! మీరు వెంటనే దేవతలను దోడ్కొని నిర్భయముగా కైలాసవాసియగు రుద్రునివద్దకు వెళ్లుడు. ఉత్తమమగు నాపూర్ణరూపమే రుద్రుడు. నేను దేవకార్యము కొరకై రెండవ ఆకారమును దాల్చి ఉద్భవించినాను (38, 39). ఓ హరీ! నా అవతారము. పరిపూర్ణుడు, సర్వసమర్థుడు అగు రుద్రుడు భక్తులకు సులభుడై వారి కొరకై కైలాసపర్వతమునందు స్థిరుడై ఉన్నాడు (40). నీకు నాకు భేదము లేదు. మీరిద్దరు ఆ రుద్రుని సేవించదగుదురు. దేవతలు మొదలగు స్థావరజంగమాత్మకముగ సర్వప్రాణులు ఆయనను సేవింతురు (41). మన ఇద్దరిలో భేదమును కల్పించు వ్యక్తి ఇహలోకములో పుత్రులచే, పౌత్రులచే నిరాకరింపబడినవాడై కష్టముల ననుభవించి, పిదప నరకమును పొందును (42).


ఈ విధముగా పలికిన దుర్గాపతియగు శివుని రాధాసమేతుడైన శ్రీకృష్ణుడు పలుమార్లు ప్రణమిల్లి తన అనుచరులతో గూడి తన స్థానమునకు వెళ్లెను (43). ఓ వ్యాసా! బ్రహ్మవిష్ణువులు కూడ భయరహితులై ఆనందముతో ఈశ్వరునకు పలుమార్లు ప్రణమిల్లి వెంటనే వైకుంఠమునకు వెళ్లిరి (44). ఆ బ్రహ్మ విష్ణువులు అచటకు చేరి దేవతలకు వృత్తాంతమునంతను వివరించి వారిని దోడ్కొని కైలసపర్వతమునకు వెళ్లిరి (45). అచట పార్వతీ వల్లభుడు, దీనుల రక్షణ కొరకై దేహమును స్వీకరించినవాడు, సగుణుడు, దేవదేవుడు అగు మహేశ్వర ప్రభుని గాంచి (46). పూర్వమునుందు వలెనే వారందరు వినయముతో గూడిన వారై తలలు వంచి చేతులు జోడించి భక్తితో బొంగురుపోయిన కంఠములతో స్తుతించిరి (47).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 850 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 31 🌴


🌻 Śiva’s advice to Viṣṇu and Brahmā - 5 🌻



Śiva said:—


38. “O Viṣṇu, O Brahmā, lovingly listen to my words. O dear ones, go quickly for the pleasure of the gods. Be fearless.


39. Go to Rudra, resident of Kailāsa,[2] who has my excellent and perfect form. He has manifested himself for the task of the gods with a separate form and features.


40. O Viṣṇu, it is for this purpose that the lord assuming my form fully and perfectly stays on the mountain Kailāsa favouring the devotees by being subservient to them.


41. There is no difference in him from us both. He shall be served by you two and all living beings—mobile and immobile as well as the gods and others always.


42. He who differentiates between us falls into hell. In this life too he will attain stress and be devoid of sons and grandsons.



Sanatkumāra said:—


43. After bowing again and again to the lord of Pārvatī who had spoken thus, Kṛṣṇa returned to his abode accompanied by Rādhā.


44. O Vyāsa, Viṣṇu and Brahmā became delighted and relieved of fear. After bowing again and again to Śiva they hastened to Vaikuṇṭha.


45. Having come there and mentioning everything to the gods, Brahmā and Viṣṇu went to Kailāsa taking the gods with them.


46-47. On seeing lord Śiva there, the lord and husband of Pārvatī, who had taken a body for protecting the distressed, the lord of the gods possessed of attributes, they eulogised him as before with devotion and choking words. They joined their palms in reverence humbly and with drooping shoulders.



Continues....


🌹🌹🌹🌹🌹



1 view0 comments

Comentários


bottom of page