top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 851 / Sri Siva Maha Purana - 851


🌹 . శ్రీ శివ మహా పురాణము - 851 / Sri Siva Maha Purana - 851 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 31 🌴


🌻. బ్రహ్మవిష్ణువులకు శివుని ఉపదేశము - 6 🌻


దేవతలిట్లు పలికిరి - ఓ దేవదేవా! మహాదేవా! గిరిజాపతీ! శంకరా! మేము నిన్ను శరణు జొచ్చినాము. భయముచే కంగారు పడుతున్న దేవతలను రక్షించుము (48). దేవతలను నశింపజేసిన దానవవీరుడగు శంఖచూడుని సంహరించుము. ఆతడు దేవతలను యుద్ధములో జయించి కష్టములకు గురిచేసినాడు (49) దేవతలు అధికారములను గోల్పోయి మానవులవలె భూలోకములో తిరుగాడు చున్నారు. వాని భయము వలన వారు దేవలోకమును కన్నెత్తి చూడలేకున్నారు (50). దీనులనుద్ధరించే దయానిధీ! దేవతలనీ సంకటమునుండి ఉద్ధరించుము. ఆ దానవరాజును సంహరించి ఇంద్రునకు భయము నుండి విముక్తిని చేయుము. ఓ మహేశ్వరా! (51). ఈ మాటలను విని భక్త వత్సలుడగు శంభుడు నవ్వి మేఘగర్జనవలె గంభీరమగు స్వరముతో దేవతలనుద్దేశించి ఇట్లు పలికెను (52).


శ్రీ శంకరుడిట్లు పలికెను- ఓ హరీ! ఓ బ్రహ్మా! దేవతలారా! మీరు నిశ్చయముగా మీమీ స్థానములకు వెళ్లుడు. అనుచరులతో సహా శంఖచూడుని వధించెదను. ఈ విషయములో సంశయము వలదు (53).


సనత్కుమారుడిట్లు పలికెను- మహేశ్వరుని అమృతతుల్యమగు ఈ పలుకులను విని వారు అందరు శంఖచూడుడు నశించినట్లే యని తలంచి మహానందమును పొందిరి (54). అపుడు హరి వైకుంఠమునకు , బ్రహ్మ సత్యలోకమునకు వెళ్లిరి. దేవతలు మొదలగు వారు మహేశునకు ప్రణమిల్లి తమ స్థానములకు వెళ్లిరి (55).


శ్రీ శివ మహా పురాణములోని రుద్ర సంహితయందు యుద్ధఖండలో శివోపదేశవర్ణనము అనే ముప్పది ఒకటవ ఆధ్యాయము ముగిసినది (31).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹SRI SIVA MAHA PURANA - 851 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 31 🌴


🌻 Śiva’s advice to Viṣṇu and Brahmā - 6 🌻



The gods said:—


48. O great god, lord of the gods, O Śiva, the lord of Pārvatī, we seek refuge in you. Please save the terrified gods.


49. Please slay Saṅkhacūḍa the king of Asura and the destroyer of the gods. The gods have been defeated and harassed by him.


50. Like men they are roaming on the earth divested of their powers. Their region the Devaloka has become very dreary to look at due to fear.


51. O uplifter of the distressed, O ocean of mercy, redeem the gods, from this exigency. O great lord, save Indra from fright by killing that ruler of Dānavas.



Sanatkumāra said:—


52. “On hearing the words of the gods, Śiva favourably disposed to his devotees spoke to them laughingly in the rumbling tone of the cloud.



Lord Śiva said:—


53. O Viṣṇu, O Brahmā, O Gods, return to your own abodes by all means. I shall kill Śaṅkhacūḍa along with his followers and attendants. There is no doubt about it.



Sanatkumāra said:—


54. On hearing the words of lord Śiva sweet as nectar they were excessively delighted considering the Dānava already killed.


55. After bowing to lord Śiva, Viṣṇu went to Vaikuṇṭha and Brahmā to Satyaloka. The god and others went to their own abodes.



Continues....


🌹🌹🌹🌹🌹



1 view0 comments

コメント


bottom of page