top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 854 / Sri Siva Maha Purana - 854



🌹 . శ్రీ శివ మహా పురాణము - 854 / Sri Siva Maha Purana - 854 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 32 🌴


🌻. పుష్పదంతుడు శంఖచూడునకు నచ్చజెప్పుట - 3 🌻


శంఖచూడుడిట్లు పలికెను- దేవతలకు రాజ్యము నీయను. రాజ్యము (భూమి) వీరులు అనుభవింప దగినది. ఓ రుద్రా! దేవపక్షపాతివగు నీకు యుద్ధమును ఇచ్చెదను. (18) శత్రువునకు తనపై దండెత్తే అవకాశము నిచ్చు వీరుడు ఈ లోకములో అధముడు. ఓరుద్రా! కావున నేను ముందుగా నీపై దండెత్తెదను. దీనిలో సందేహము లేదు (19). నా జైత్రయాత్రను పరిశీలించినచో, నేను రేపు తెల్లవారు సరికి అచటకు చేరగలను. నీవు వెళ్లి నా ఈ వచనమును రుద్రునకు చెప్పుము (20). శంభుని దూతయగు పుష్పదంతుడు గర్వితుడగు శంఖచూడుని ఈ వచనములను విని నవ్వి ఆ రాక్షసరాజుతో నిట్లనెను (21). ఓ రాజశేఖరా! శంకరుని గణముల యెదుట నైననూ నిలువగలిగే యోగ్యత నీకు లేదు. ఇక శంకరుని ఎదుట నిలబడుట గురించి చెప్పునదేమున్నది? (22). కావున నీవు అధికారములనన్నిటినీ దేవతలకు అప్పజెప్పుము. ఓరీ! నీకు జీవించు కోరిక ఉన్నచో, పాతాళమునకు పొమ్ము (23). ఓ రాక్షసశ్రేష్ఠా! శంకరుడు సామాన్య దేవతయని తలంచుకుము. ఆయన సర్వులకు, మరియు ఈశ్వరులకు కూడ ఆధీశ్వరుడగు పరమాత్మ (24).


ఇంద్రాది సమస్త దేవతలు, ప్రజాపతులు, సిద్ధులు, మునులు, మరియు నాగశ్రేష్ఠులు ఆయన ఆజ్ఞకు నిత్యము వశవర్తులై ఉందురు (25). బ్రహ్మ విష్ణువులకు ప్రభువగు ఆయన సగుణుడు, నిర్గుణుడు కూడా అగుచున్నాడు. ఆయన కనుబొమను విరిచినంతమాత్రాన సర్వలోకములకు ప్రళయము వాటిల్లును (26). లోకములను సంహరించే రుద్రుడు శివుని పూర్ణస్వరూపుడు. వికారములు లేని ఆ పరాత్పరుడు దుష్టులను సంహరించి సత్పురుషులకు శరణు నొసంగును (27). ఆ మహేశ్వరుడు బ్రహ్మ విష్ణువులకు కూడ అధీశ్వరుడు. ఓ దానవశ్రేష్ఠా! ఆయన శాసనమును తిరస్కరించుట తగదు (28).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 854 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 32 🌴


🌻 The Emissary is sent - 3 🌻



Śaṅkhacūḍa said:—


18. I will never return the kingdom to the god. The earth shall be enjoyed by heroic warriors. O Śiva, I shall fight with you who are a partisan of the gods.


19. The hero who allows another to supercede him is the basest in the world. Hence O Śiva I shall certainly march towards you just now.


20. I reach there in the morning in the course of my victorious campaign. O messenger, go and tell all this to Siva.



Samtkumāra said:—


21. On hearing these words of Śaṅkhacūḍa, the emissary of Śiva laughed aloud and then spoke haughtily to the lord of the Asuras.



Puṣpadanta said:—


22. O Great king, you cannot face the Gaṇas of Śiva. Then how can you face lord Śiva himself?


23. So return their positions of authority to the gods entirely. Move immediately to Pātāla if you wish to live.


24. O excellent Dānava, do not regard Śiva an ordinary deity. He is indeed the great soul, the lord of the lord of all.


25. Indra and other gods abide by his commands. The Siddhas, the patriarchs, the sages and the serpent lords all follow suit.


26. He is the overlord of Viṣṇu and Brahmā. He is both possessed and devoid of attributes. By a mere twitch of his knitted eyebrow everything is dissolved.


27. Śiva is the perfect form of gods, the cause of the annihilation of the worlds, the goal of the good, the destroyer of the wicked. He is free from aberrations. He is greater than the greatest.


28. He is the overlord of Brahmā. He is lord Śiva even into Viṣṇu. O excellent Dānava, his behest should never be slighted.



Continues....


🌹🌹🌹🌹🌹



2 views0 comments

Comments


bottom of page