top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 858 / Sri Siva Maha Purana - 858




🌹 . శ్రీ శివ మహా పురాణము - 858 / Sri Siva Maha Purana - 858 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 33 🌴


🌻. శంఖచూడునిపై శివుని యుద్ధ సన్నాహము - 3 🌻


ఆ వీరులందరు వేయి, వంద మరియు ఇరవై కోట్ల గణములను వెంట నిడుకొని ఆ యుద్ధ మహోత్సవములో పాల్గొనుటకై అచటకు విచ్చేసిరి (21). వేయి కోట్ల భూతములతో, మూడు కోట్ల ప్రమథులతో, మరియు అరవై ఏడు కోట్ల లోమజులతో (రుద్రగణములలో ఒక జాతి) కూడి వీరభద్రుడు విచ్చేసెను (22). కాష్ఠారూఢుడు, సుకేశుడు, వృషభుడు, పూజ్యుడగు విరూపాక్షుడు, మరియు సనాతనుడు ఒక్కొక్కరు అరవై నాలుగు కోట్ల గణములతో వచ్చిరి (23). తాలకేతువు, షడాస్యుడు, ప్రతాపవంతుడగు పంచాస్యుడు, సంవర్తకుడు, చైత్రుడు, లంకులీశుడు, స్వయం ప్రభుడు (24). లోకాంతకుడు, దీప్తాత్ముడు, సర్వసమర్ధుడగు దైత్యాంతకుడు, జ్ఞానమూర్తి యగు భృంగి, శోభాయుక్తుడు దేవదేవునకు ప్రియుడు అగు రిటి (25), అశని, అరవై నాలుగు కోట్ల గణమలతో గూడియున్న భానుకుడు, కంకాలుడు, కాలుడు, నంది మరియు సర్వాంతకుడు (26) మాత్రమే గాక, లెక్క లేనంతమంది మహాబలశాలురగు ఇతర గణాధ్యక్షులు నిర్భయలై శంఖచూడునితో యుద్దము కొరకు ప్రేమతో బయలుదేరిరి (27).


వారందరికీ వేయి చేతులు గలవు. వారు జటలను కిరీటముగా దాల్చి చంద్రరేఖను అలంకారముగా దాల్చిరి. వారు నల్లని కంఠమును, మూడు కన్నులను కలిగియుండిరి (28). వారందరు రుద్రాక్షలను, హారములను, కుండలములను, కేయూరములను, కిరీటములను ఇతర ఆభరణములను అలంకరించుకొని చక్కని భస్మను ధరించి యుండిరి (29). వారు బ్రహ్మ - ఇంద్ర - విష్ణువులను బోలియుండిరి. అణిమాది సిద్ధులను కలిగి కోటి సూర్యుల కాంతి గల ఆ గణములు యుద్ధ ప్రక్రియలో ఆరితేరియుండిరి (30).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 858 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 33 🌴


🌻 March of The Victorious Lord Śiva - 3 🌻


21. With thousands, hundreds and twenties of crores many heroes came there to take part in that festival of War.


22. Vīrabhadra came there with a thousand crores of Bhūtas, three crores of Pramathas and sixty-four crores of Lomajas.


23. Kāṣṭhārūḍha with sixty four crores and Sukeśa and Vṛṣabha too similarly. The honourable Virūpākṣa and Sanātana went with sixty-four crores.


24-26. Tālaketu, Ṣaḍāsya, the valorous Pañcāsya, Samvartaka, Caitra, Laṅkulīśa Svayamprabhu, Lokāntaka, Dīptātman, lord Daityāntaka, lord Bhṛṅgīriṭi, the glorious Devadevapriya, Aśani, Bhānuka, Kaṅkāla, Kālaka, Kāla, Nandin and Sarvāntaka each went with sixty-four crores.


27. These and other leading Gaṇas, powerful and innumerable started lovingly to fight fearlessly with Śaṅkhacūḍa.


28. All of them had thousand arms, matted hair for their crowns, and crescent moon for embellishment. They had blue necks and three eyes.


29. They wore Rudrākṣas as ornaments. They had smeared their bodies with fine Bhasma. They were decorated with necklaces, earrings, bracelets, coronets and other ornaments.


30. They resembled Brahmā, Indra and Viṣṇu. They had the attributes of Aṇimā[3] etc. They were as refulgent as a crore suns. They were efficient in warfare.



Continues....


🌹🌹🌹🌹🌹




2 views0 comments

Comments


bottom of page