top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 859 / Sri Siva Maha Purana - 859



🌹 . శ్రీ శివ మహా పురాణము - 859 / Sri Siva Maha Purana - 859 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 33 🌴


🌻. శంఖచూడునిపై శివుని యుద్ధ సన్నాహము - 4 🌻


వారిలో కొందరు భూమండలమునందు, కొందరు పాతాళమునందు నివసించెదరు. ఓ మునీ! కొందరు ఆకాశమునందు, మరికొందరు సప్త స్వర్గములయందు నివసించెదరు (31). ఓ దేవర్షీ! ఇన్ని మాటలేల? సర్వలోకములయందు నివసించే శివగణములందరు దానవులతో యుద్ధము కొరకై వెళ్లిరి (32). భయంకరాకారులగు అష్టభైరవులు, ఏకాదశరుద్రులు, అష్టవసువులు, ఇంద్రుడు, మరియు ద్వాదశాదిత్యులు శీఘ్రముగా వెళ్లిరి (33). అగ్ని, చంద్రుడు, విశ్వకర్మ, అశ్వినీదేవతలు, కుబేరుడు, యముడు, నిర్‌ బుతి మిరియు నల కూబరుడు కూడ వెళ్లిరి (34).


వాయు, వరుణ, బుధ, మంగళులు, ఇతరగ్రహములు మరియు వీర్యవంతుడగు కామదేవుడు కూడ మహేశ్వరుని వెనుక నడిచిరి (35). ఉగ్రదంష్ట్ర, ఉగ్రదండ, కోరట, కోటభులు కూడ శివుని వెంట నడిచిరి. వంద భుజములుగల మహేశ్వరియగు భద్రకాళీదేవి స్వయముగా (36). గొప్పరత్నములను పొదిగి నిర్మించిన విమానముపై కూర్చున్నదై ఎర్రని వస్త్రములను, ఎర్రని మాలను ధరించి, రక్తచందనమును పులుముకొని (37). చక్కని స్వరముతో పాడుతూ, ఆనందముతో నవ్వుతూ, నాట్యమాడుచూ, తన భక్తులకు అభయమును ఇస్తూ, శత్రువులకు భీతిని గొల్పుతూ (38)



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 859 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 33 🌴


🌻 March of The Victorious Lord Śiva - 4 🌻


31. O sage, some of them were the residents of the earth; some of the Pātāla, some of the sky and some of the seven heavens[4].


32. O celestial sage, why shall I dilate? All the Śivagaṇas, residents of different regions went to fight with the Dānavas.


33-35. The eight Bhairavas[5] the terrible eleven Rudras,[6] the eight Vasus,[7] the twelve Ādityas,[8] Indra, the fire god, the moon, Viśvakarman, the Aśvins, Kubera, Yama, Nirṛti, Nalakūbara, Vāyu, Varuṇa, Budha, Maṅgala, the other planets and the valorous Kāmadeva went with lord Śiva.


36-37. Ugradaṇḍa, Ugradaṃṣṭra, Koraṭa and Koṭabha too went. The great goddess Bhadrakālī herself with hundred arms was seated in an aerial chariot studded with gems. She was wearing a red cloth and a red garland. She had smeared red unguents over her body.


38. She was dancing, laughing and singing in a sweet voice joyously. She was offering protection to her own people and striking terror to the enemies.



Continues....


🌹🌹🌹🌹🌹





1 view0 comments

Comments


bottom of page