🌹 . శ్రీ శివ మహా పురాణము - 860 / Sri Siva Maha Purana - 860 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 33 🌴
🌻. శంఖచూడునిపై శివుని యుద్ధ సన్నాహము - 5 🌻
భయంకరము, మిక్కిలి చంచలము, యోజనము పొడవు గలది యగు నాలుకను కలిగినదై నడచెను. శంఖము, చక్రము, గద, పద్మము, ఖడ్గము, ధనస్సు, మరియు బాణములను (39). గుండ్రని లోతైన యోజనము వెడల్పుగల కాపాలమును, ముద్గరమును, రోకలిని, ఆకసమును స్పృశించు త్రిశూలమును, యోజనము పొడవు గల శక్తిని, వజ్రమును, దట్టని డాలును ఆమె ధరించెను. అమె వైష్ణవ, వారుణ, వాయవ్యాస్త్రములను, నాగపాశమును (40, 41), నారాయణ, గాంధర్వ, బ్రహ్మ, గారుడ, పార్జన్య, పాశుపత, జృంభణ, పార్వత (42), మహావీర, సౌర కాలకాల, మహానల, మహేశ్వర అస్త్రములను, యమదండమును, సంమోహన (43), సమర్థ అస్త్రములను, ఇంకనూ అనేకములగు దివ్యాస్త్రములను చేతులన్నిటియందు దాల్చి, అపుడామె బయలు దేరెను (44).
ఆమె భయంకరాకారులగు మూడుకోట్ల డాకినిలతో, మరియు మూడు కోట్ల యోగినులతో సహా వచ్చి అక్కడ నిలబడెను (45). భూత, ప్రేత, పిశాచ, కూష్మాండ, బ్రహ్మరాక్షస, వేతాల, యక్ష, కిన్నరులతో (46) చుట్టువార బడియున్న కుమారస్వామి తండ్రియగు చంద్రశేఖరునకు ప్రణమిల్లి ఆయన ఆజ్ఞచే ఆయనకు సహాయకుడై ప్రక్కనే నిలబడెను (47). అపుడు ఉగ్రరూపుడు, నిర్భయుడు నగు శంభుడు తన సైన్యమునంతనూ తీసుకొని శంఖచూడునితో యుద్ధమునకు వెళ్లెను (48). దేవతల నుద్దరించుట కొరకై మహాదేవుడు సుందరమగు చంద్రభాగానదీ తీరమునందు వటవృక్షము యొక్క మూలమునందు మకాము చేసెను (49).
శ్రీ శివమహాపురాణములో రుద్రససంహితయందలి యుద్ధఖండలో మహాదేవుని యుద్ధయాత్ర వర్ణనమనే ముప్పది మూడవ అధ్యాయము ముగిసినది (33).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 860 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 33 🌴
🌻 March of The Victorious Lord Śiva - 5 🌻
39-44. Her tongue was a yojana long and terrible. She bore conch, discus, mace, lotus, sword, leather shield, bows, arrows, skull of circular shape, a yojana in width and majestic in appearance, a trident that touched the sky, a yojana long spear, iron club, threshing rod, thunderbolt, sword, a thick shield, the miraculous weapons of Viṣṇu, Varuṇa, Vāyu, Nārāyaṇa, Gandharva, Brahmā, Garuḍa, Parjanya, Paśupati, Parvata, and Maheśvara, Nāgapāśa, Jṛṃbhaṇāstra, the Mahāvīra, the Saura, the Kālakāla and the Mahānala weapons, the staff of Yama, the Sammohana, the divine weapon called Samartha. Many such and other divine weapons she held in her hands.
45. She came and stood there with three crores of Yoginīs and three crores of terrible Ḍākinīs.
46. Bhūtas, Pretas, Piśācas, Kūṣmāṇḍas, Brahmarākṣasas, Vetālas, Yakṣas, Kinnaras and Rākṣasas too came there.
47. Skanda was surrounded by these all. He bowed to Śiva and at his bidding stayed near his father to assist him.
48. The fearless, fierce Śiva gathered his armies and went to fight Śaṅkhacūḍa.
49. The great god stationed himself at the foot of a beautiful Banyan tree on the banks of the river Candrabhāgā,
[9] for the emancipation of the gods.
Continues....
🌹🌹🌹🌹🌹
Комментарии