top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 861 / Sri Siva Maha Purana - 861



🌹 . శ్రీ శివ మహా పురాణము - 861 / Sri Siva Maha Purana - 861 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 34 🌴


🌻. శంఖచూడుని యుద్ధయాత్ర - 1 🌻


వ్యాసుడిట్లు పలికెను - ఓ బ్రహ్మపుత్రా! నీవు మహాబుద్ధిశాలివి. ఓ మునీ ! చిరకాలము జీవించుము. చిత్రమైనది, చాల గొప్పదియగు చంద్రశేఖరుని చరితమును చెప్పితివి (1). శివుని దూత మరలి పోగానే ప్రతాపవంతుడగు శంఖచూడాసురుడు ఏమి చేసినాడు? నీవా గాథను విస్తారముగా చెప్పుము (2).


సనత్కుమారుడిట్లు పలికెను - దూత నిర్గమించిన తరువాత ప్రతాపవంతుడగు శంఖచూడుడు సభ నుండి అంతఃపురము లోపలికి వెళ్లి ఆ వార్తను తులసికి చెప్పెను (3).


శంఖచూడుడిట్లు పలికెను - ఓ దేవీ! శంభుని దూత పలికిన పలుకులు నన్ను యుద్ధమునకు ప్రేరపించినవి. కావున నేను యుద్ధము కొరకు వెళ్లుచున్నాను. నీవు నా ఆజ్ఞను నిశ్చయముగా పాలించుము (4). జ్ఞానియగు ఆ శంఖచూడుడు ప్రియురాలితో నిట్లు పలికి ఆ శంకరుని అనాదరము చేసి ఆమెకు ఆనందముతో అనేకవిషయములను బోధిస్తూ ఆమెతో గూడి క్రీడించెను (5). ఆ దంపతులు రాత్రియందు సుఖసముద్రములో తేలియాడుతూ అనేక నర్మోక్తులను పలుకుతూ ఆనందముగా గడిపిరి (6). ఆతడు బ్రాహ్మ ముహూర్తమునందు నిద్ర లేచి, కాలకృత్యములను దీర్చుకొని ప్రాతఃకాల కర్మలననుష్ఠించి ముందుగా అంతులేని దానములను చేసెను (7). ఆతడు తన పుత్రిని సర్వదానవులకు చక్రవర్తిని చేసి రాజ్యమును, సర్వసంపదలను మరియు భార్యను ఆతనికి అప్పజెప్పను (8). ఆ రాజు తన యాత్రను ప్రతిఘటిస్తూ ఏడ్చుచున్న ప్రియురాలికి మరల అనేక వచనములను బోధించి ఓదార్చెను (9). అపుడాతడతు వీరుడగు తన సేనాపతిని పిలిపించెను. సాదరముగా నిలబడిన సేనానాయకుని సైన్యసన్నాహమును చేయుమని ఆదేశించి తాను స్వయముగా సంగ్రామమునకు సన్నద్ధుడాయెను (10).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 861 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 34 🌴


🌻 The March of Śaṅkhacūḍa - 1 🌻



Vyāsa said:—


1. O dear son of Brahmā, O sage of great intellect, live long for many years. You have narrated the great story of the mooncrested lord.


2. When Śiva’s emissary had departed, what did the valorous Dānava, Śaṅkhacūḍa do? Please mention that in detail.



Sanatkumāra said:—


3. When the messenger returned, the valorous Śaṅkhacūḍa went in and told his wife Tulasī all the details.



Śaṅkhacūḍa said:—


4. O dear lady, infuriated by the words of Śiva’s messenger I have prepared for a war. Hence I am going to fight. You carry out my directions.



Sanatkumāra said:—


5. After saying this and slighting Śiva, that demon professing to be wise advised his wife in various ways and sported with her with delight.


6. Throughout that night, the couple indulged in sexual dalliance. Uttering coaxing and cajoling words, practising various erotic arts, they immersed themselves in the ocean of happiness.


7. He got up in the Brāhma Muhūrta,[1] and finished his daily routine in the morning. He then performed the offering of charitable gifts.


8-9. He crowned his son as the lord of Dānavas. He entrusted his wife, his kingdom and his riches to the care of his son. When his wife cried and dissuaded him from going to the war he consoled her by various words of appeasement.


10. He called his general and ordered him to be ready for the war.




Continues....


🌹🌹🌹🌹🌹



0 views0 comments

Comments


bottom of page