🌹 . శ్రీ శివ మహా పురాణము - 862 / Sri Siva Maha Purana - 862 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 34 🌴
🌻. శంఖచూడుని యుద్ధయాత్ర - 2 🌻
శంఖచూడుడిట్లు పలికెను - ఓ సేనాపతీ! ఈనాడు యుద్ధనిపుణులగు వీరులందరు యుద్దమునకు కావలసిన ఏర్పట్లనన్నిటినీ సంసిద్ధము చేసుకొని బయలుదేరెదరుగాక! (11)దైత్యుల యొక్క, శూరలగు దానవులయొక్క, మరియు బలవంతులగు కంకులయొక్క ఎనభై ఆరుపటాలములు సైన్యము ఆయుధములను సిద్ధముచేసుకొని నిర్భయముగా వెంటనే బయలుదేరవలెను (12). కోటి సైన్యముతో సమమగు పరాక్రమముగల అసురుల సేనలు ఏబది గలవు. దేవపక్షపాతియగు శంభునితో యుద్దము కొరకై ఆ సేనలు బయలుదేరును గాక! (13) ధౌమ్రుల వంద సేనలు నా ఆజ్ఞచే సన్నద్ధులై శంభునితో యుద్దము కొరకు వెంటనే బయలుదేరవలెను (14). కాలకేయులు, మౌర్యులు, మరియు కాలకులు నా ఆజ్ఞచే సన్నద్ధులై రుద్రునితో యుద్ధము కొరకు బయలుదేరెదరు గాక! (15).
సనత్కుమారుడిట్లు పలికెను - అసురులకు, దానవులకు ప్రభువు, మహాబలశాలియగు శంఖచూడుడు ఇట్లు ఆజ్ఞాపించి వేలాది పటాలముల మహాసైన్యముతో చుట్టు వారబడిన వాడై బయలు దేరెను (16). ఆతని సేనాపతి యుద్ధకళలో నిపుణుడు, మహాదథి, మహావీరుడు, యుద్ధములో రథికులలో శ్రేష్ఠుడు (17). మూడు లక్షల అక్షౌహిణీల సేనతో గూడియున్న ఆ సేనాపతి మంగళకరమగు పూజాదులను చేసి శిబిరము బయటకు వచ్చెను. యుద్ధములో శత్రు వీరులకాతడు భయమును గొల్పు చుండెను (18).ఆతడు శ్రేష్ఠమగు రత్నములతో అద్భుతముగా నిర్మింపబడిన విమానము నధిష్ఠించి, పెద్దలందరికీ నమస్కరించిన తరువాత, యుద్ధము కొరకు బయలుదేరెను (19).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 862 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 34 🌴
🌻 The March of Śaṅkhacūḍa - 2 🌻
Śaṅkhacūḍa said:—
11. O general, let the heroic warriors start for the war. Let them be ready for action; they have been trained well for the war.
12. Let the heroic Dānavas and Daityas, the armies of the powerful Kaṅkas of eighty-six divisions well-equipped in arms set out fearlessly.
13. Let the fifty families of Asuras, having the heroism and prowess of a crore set out to fight with Śiva, the partisan of the gods.
14. At my bidding, let the hundred armed families of Dhaumras speedily set out to fight with Śiva.
15. At my behest, let the Kālakeyas Mauryas, Dauhṛdas and the Kālakas set out ready for the fight with Śiva.
Sanatkumāra said:—
16. After ordering thus, the powerful lord of Asuras and the Emperor of the Dānavas set out surrounded by thousands of warriors and great armies.
1 7. His general was an expert in the science and technique of warfare. He was the best of charioteers a great hero and skilled in warfare.
18. He had three hundred thousand Akṣauhiṇī[2] armies. He performed the rites of auspicious beginning and came out of the camp. He was terrible to the watching heroes.
19. Mounting on an aerial chariot of exquisite build and inlaid with gems, and making obeisance to the elders and preceptors he set out for the battle.
Continues....
🌹🌹🌹🌹🌹
Komentáře