top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 864 / Sri Siva Maha Purana - 864




🌹 . శ్రీ శివ మహా పురాణము - 864 / Sri Siva Maha Purana - 864 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 35 🌴


🌻. శంఖచూడుని దూత శివునితో సంభాషించుట - 1 🌻


సనత్కుమారుడిట్లు పలికెను - ఆ రాక్షసరాజు అక్కడ మకాము చేసి, మహాజ్ఞాని యగు ఒక గొప్ప దానవశ్రేష్ఠుని శివుని వద్దకు దూతగా పంపెను (1).


ఆ దూత అచటకు వెళ్లి, ఫాలభాగమునందు చంద్రవంక గలవాడు, వట వృక్షమూలము నందు కూర్చున్నవాడు, కోటి సూర్యులతో సమానముగు కాంతి గలవాడు (2), యోగాసనమును వేసి కనులతో ముద్రను ప్రదర్శించువాడు, చిరునగవు మోమువాడు, స్వచ్ఛమగు స్ఫటికమును బోలియున్నవాడు, బ్రహ్మతేజస్సుతో వెలిగి పోవుచున్న వాడు (3), త్రిశూలమును పట్టిశమును పట్టుకున్న వాడు, వ్యాఘ్రచర్మమును వస్త్రముగా దాల్చినవాడు, భక్తుల మృత్యువును పోగోట్టువాడు, శాంతస్వరూపుడు, గౌరీప్రియుడు, ముక్కంటి (4), తపస్సుల ఫలములనిచ్చువాడు, సర్వసంపదలను కలిగించువాడు, శీఘ్రముగా సంతోషించువాడు, ప్రసన్నమగు మోముగలవాడు, భక్తులను అనుగ్రహించువాడు (5) , జగత్తునకు తండ్రి, జగత్తునకు కారణము, జగత్‌ స్వరూపములో నున్నవాడు, సర్వమునుండి పుట్టువాడు,సర్వమును పాలించువాడు, సర్వమునకు కర్త, జగత్తును ఉపసంహరించు వాడు (6), సర్వకారణ కారణుడు, పాపసముద్రమును దాటించువాడు, జ్ఞానమునిచ్చువాడు, జ్ఞానమునకు కారణుడు, జ్ఞాన-ఆనంద స్వరూపడు, అద్యంతములు లేనివాడు (7) అగు శంకరుడు కుమారస్వామితో కూడియుండగా చూచెను. దూతయగు ఆ దానవీరుడు రథమునుండి దిగి ఆయనకు శిరము వంచి ప్రణమిల్లెను (8).


ఆయనకు ఎడమవైపున భద్రకాళి, ఎదుట కుమారస్వామి ఉండిరి. లోకమర్యాదనను సరించి కాళి, కుమారస్వామి, మరియు శంకరుడు ఆతనిని ఆశీర్వదించిరి (9). గొప్ప శాస్త్రవేత్తయగు, శంఖచూడుని దూత అపుడు చేతులు జోడించి శంకరునకు ప్రణమిల్లి ఈ శుభవచనములను పలికెను (10).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 864 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 35 🌴


🌻 The conversation between Śiva and the emissary of Śaṅkhacūḍa - 1 🌻


Sanatkumāra said:—


1. Stationing himself there, the lord of Dānavas sent a leading Dānava of great knowledge as his emissary to Śiva.


2. The emissary went there and saw the moon-crested lord Śiva, of the refulgence of a crore suns, seated at the root of the Banyan tree.


3. He saw him sitting in a yogic pose, showing the mystic gesture with his eyes, with a smiling face and body as pure as crystal and blazing with transcendent splendour.


4-7. Śiva held the trident and the iron club. He was clad in the hide of the tiger. The emissary saw the three-eyed lord of Pārvatī, the enlivener of the life of the devotees, the quiet Śiva, the dispenser of the fruits of penance, the creator of riches, quick in being propitiated, eager to bless the devotees and beaming with pleasure in his face. He saw the lord of the universe, the seed of the universe, identical with the universe and of universal form, born of all, lord of all, creator of all, the cause of the annihilation of the universe, the cause of causes, the one who enables devotees to cross the ocean of hell, the bestower of knowledge, the seed of knowledge, knowlege-bliss and eternal.


8. On seeing him, the messenger, the leader of Dānavas, descended from his chariot and bowed to him as well as to Kumāra.


9. He saw Bhadrakālī to his left and Kārttikeya standing before him. Kālī, Kārttikeya and Śiva offered him the conventional benediction.


10. This emissary of Śaṅkhacūḍa, had full knowledge of the sacred texts. He joined his palms in reverence and bowing to him spoke the auspicious words.



Continues....


🌹🌹🌹🌹🌹





2 views0 comments

Comments


bottom of page