🌹 . శ్రీ శివ మహా పురాణము - 869 / Sri Siva Maha Purana - 869 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 36 🌴
🌻. దేవాసుర సంగ్రామము - 1 🌻
సనత్కుమారుడిట్లు పలికెను- ఆ దూత అచటకు వెళ్లి శివుని వచనమును యథార్థముగా వివరముగా చెప్పెను. మరియు శివుని నిశ్చయమును ఉన్నది ఉన్నట్లుగా చెప్పెను (1). దానవచక్రవర్తి, ప్రతాపశాలియగు ఆ శంఖచూడుడు ఆ మాటలను విని మిక్కిలి ప్రీతితో యుద్ధమును స్వీకరించెను (2). ఆతడు వెంటనే రథమునధిష్ఠించెను. మంత్రులు ఆతనిని అనుసరించిరి. ఆతడు శంకరునితో యుద్ధము కొరకై తన సైన్యము నాదేశించెను (3). శివుడు కూడ వేగముగా తన సైన్యమును, మరియు దేవతలను ప్రేరేపించెను. ఆయన స్వయముగా సర్వేశ్వరుడే అయిననూ లీలచే యుద్ధమునకు సన్నద్ధుడాయెను (4).
వెంటనే యుద్ధము ఆరంభమయ్యెను. అనేక రకముల వాద్యములు మ్రోగినవి. పెద్ద కోలాహలము వీరుల శబ్దముతో గూడి చెలరేగెను (5). ఓ మునీ! దేవదానవులు ఒకరితోనొకరు యుద్ధమును చేయ మొదలిడిరి. అచట దేవదానవసైన్యములు ధర్మయుద్ధమును చేసినవి (6). మహేంద్రుడు స్వయముగా వృషపర్వునితో యుద్ధమును చేసెను. భాస్కరుడు విప్రచిత్తితో ధర్మయుద్ధమును చేసెను (7).
విష్ణువు దంభునితో గొప్ప యుద్ధమును చేసెను. కాలాసురునితో కాలుడు, గోకర్ణునితో అగ్ని (8), కాలకేయునితో కుబేరుడు, మయునితో విశ్వకర్మ, భయంకరునితో మృత్యవు, సంహారునితో యముడు (9), కాలంబికునితో వరుణుడు, చంచలునితో వాయువు, ఘటపృష్టునితో బుధుడు, రక్తాక్షునితో శని (10),
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 869 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 36 🌴
🌻 Mutual fight - 1 🌻
Sanatkumāra said:—
1. The emissary returned and mentioned the words of Śiva, in detail and truthfully. He conveyed his decision as it was.
2. On hearing that, the valorous Dānava Śaṅkhacūḍa accepted lovingly the alternative of a fight.
3. Hurriedly he got into his vehicle along with his ministers. He commanded his army against Śiva.
4. Śiva too hastened to urge his army and the gods. The lord of all was ready himself with his sport.
5. The musical instruments formally announced the beginning of war. There was a great tumult along with the shouts of the heroes.
6. O sage, the mutual fight between the gods and the Dānavas ensued. Both the hosts of the gods and the Dānavas fought righteously.
7. Mahendra fought with Vṛṣaparvan. Bhāskara fought with Vipracitti.
8. Viṣṇu fought a great battle with Dambha, Kala with the Asura Kāla and the firegod fought with Gokarṇa.
9. Kubera fought with Kālakeya and Viśvakarman with Maya. Mṛtyu fought with Bhayaṃkara and Yama with Saṃhāra.
10. Varuṇa fought with Kālambika, the wind god with Cañcala. Mercury with Ghaṭapṛṣṭha and Śanaiścara with Raktākṣa.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments