🌹 . శ్రీ శివ మహా పురాణము - 870 / Sri Siva Maha Purana - 870 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 36 🌴
🌻. దేవాసుర సంగ్రామము - 2 🌻
రత్నసారునితో జయంతుడు, వర్చసుల గణముతో వసువులు, దీప్తి మంతులిద్దరితో అశ్వనీదేవతలు, ధూమ్రునితో నలకూబరుడు (11), ధురంధరునితో ధర్ముడు, గణకాక్షునితో మంగళుడు, శోభాకారునితోవైశ్వానుడు, పిపిటునితో మన్మథుడు (12), గోకాముఖుడు, చూర్ణుడు, ఖడ్గాసురుడు, ధూమ్రుడు, సంహలుడు, విశ్వుడు, ప్రతాపి మరియు పలాశి అను వారితో పన్నెండుగురు ఆదిత్యులు ధర్మయుద్ధమును చేసిరి. శివునకు సాహాయ్యమును చేయుటకు వచ్చిన ఇతర దేవతలు రాక్షసులతో యుద్ధమును చేసిరి (13, 14).
పదకొండుగురు మహారుద్రులు, భయంకరులు, వీరులు, మహాబలశాలురునగు పదకొండుగురు రాక్షసులతో యుద్ధమును చేసిరి (15). ఉగ్రచుండుడు మొదలగు వారితో మహామణి, రాహువుతో చంద్రుడు, మరియు శక్రునితో బృహస్పతి ధర్మయుద్ధమును చేసిరి (16). నందీశ్వరుడు మొదలగు వారందరు ఆ మహాయుద్ధములో దానవవీరులతో యుద్ధమును చేసిరి. విస్తారభయముచే ఆ వివరములు వేర్వేరుగా చెప్పబడుట లేదు (17).
అపుడు శంభుడు పటవృక్షమూలనందు కాశీ దేవితో, మరియు కుమారునితో కలిసి వేచియుండెను. ఓ మునీ! ఆ రెండు మహాసైన్యములలోని అందరు నిరంతరముగా యుద్ధమునకు చేయుచుండిరి (18). శంఖచూడుడు రత్నభూషణముల నలంకరించుకొని కోటి మంది దానవులు చుట్టూచేరి యుండగా సుందరమగు రత్నసింహాసనముపై ఉపవిష్టుడై యుండెను (19).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 870 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 36 🌴
🌻 Mutual fight - 2 🌻
11. Jayanta fought with Ratnasāra; the Vasus with the groups of Varcas’s; the Aśvins with the two Dīptimants and Nalakūbara with Dhūmbra.
12. Dharma fought with Dhurandhara; Maṅgala with Gaṇakākṣa; Vaiśvana with Śobhākara and Manmatha with Pipiṭa.
13-14. The twelve sun gods fought with the Asuras—Gokāmukha, Cūrṇa, Khaḍga, Dhūmra, Samhala, the valorous Viśva and Palāśa. The other gods assisting Śiva fought righteously with the other Asuras.
15. The eleven Mahārudras[1] fought with the eleven terrible Asuras of great power and valour.
16. Mahāmaṇi fought with Ugracaṇḍa and others. The god Moon fought with Rāhu and Jīva fought with Śukra.
17. Nandīśvara and the rest fought with leading Dānavas in the great battle. This is not being explained separately.
18. O sage, then Śiva stayed at the foot of the Banyan tree along with Kālī and his son. The hosts of the two armies fought continuously against each other.
19. Decorated with gemset ornaments, Śaṅkhcūḍa sat on his gemset throne of great beauty attended upon by a crore Dānavas
Continues....
🌹🌹🌹🌹🌹
Comments