top of page

శ్రీ శివ మహా పురాణము - 871 / Sri Siva Maha Purana - 871




🌹 . శ్రీ శివ మహా పురాణము - 871 / Sri Siva Maha Purana - 871 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 36 🌴


🌻. దేవాసుర సంగ్రామము - 3 🌻


అపుడు దేవాసుర వినాశకరమగు గొప్ప యుద్ధము జరిగెను. ఆ మహా యుద్ధములో దివ్యములగు అనేక ఆయుధములు ప్రయోగింపబడెను (20). గదలు, చురకత్తులు, పట్టిశములు, చక్రములు, భుశుండీలు, ప్రాసలు, ముద్గరములు, బల్లెములు, గడ్డపారలు, పరిఘలు, శక్తులు, శత్రువుపైకి ప్రయోగించుటకు సిద్ధముగా నున్న గొడ్డళ్లు (21). బాణములు, తోమరములు, కత్తులు, వేలాది ఫిరంగులు, భిందిపాలములు, మరియు ఇతరములగు ఆయుధములు వీరుల చేతులలో ప్రకాశించుచుండెను (22).


ఆ యుద్ధములో వీరులు వాటితో తలలను నరుకుచుండిరి. యుద్ధములో రెండు సైన్యములలోని వీరుల గర్జనలతో గొప్ప ఉత్సవము ప్రవర్తిల్లెను (23). ఆ యుద్ధమునందు ఏనుగులు, గుర్రములు, వాటిపై ఉపవిష్టులైన వీరులు, అనేకరథములలోని రథికులు, సారథులు, పదాతులు అనేక మంది తెగిన దేహములతో పడియుండిరి (24). తెగిన చేతులు, బాహువులు, తొడలు, నడుములు, చెవులు మరియు కాళ్లు, మరియు విరిగిన ధ్వజములు, బాణములు, కత్తులు, కవచములు, శ్రేష్ఠమగు అలంకారములు పడియుండెను (25).


ఆ యుద్ధములో సంహరింపబడిన సైనికుల తలలు కుండలములతో గూడి నేలపై చెల్లాచెదరుగా పడియుండెను. ఎగురగొట్టబడిన కిరీటములు నేలపై బడి యుండెను. తెగి పడిన ఏనుగు తుండములు వంటి తొడలతో నిండి భూమి ప్రకాశించెను (26). ఆయుధములతో అలంకారములతో గూడి తెగి పడిన గొప్ప భుజములు మరియు ఇతర అవయవములు తేనెపట్టులవలె నేలపైబడి యుండెను (27). యుద్ధములో పరుగెత్తుచున్న భటులకు మొండెముల కానవచ్చెను. ఆ మొండెములు తమ చేతులలో ఆయుధములను ఎత్తి పట్టుకొని ఎగురుచుండెను (28).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 871 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 36 🌴


🌻 Mutual fight - 3 🌻


20. Then ensued a great war in which both gods and Asuras were crushed. In that great war many divine and miraculous weapons were hurled.


21-22. Maces, long and short swords, Paṭṭiśas, Bhuśuṇḍis, Mudgaras (different kinds of iron clubs), javelins, spears, Parighas, Śaktis, axes, arrows, Tomaras, Śataghnīs, and other weapons shone in the hands of the heroes.


23. Using these weapons, the heroes severed the heads of each other. It was a jubilant occasion for the roaring heroes of the armies.


24. Elephants, horses, chariots and foot soldiers along with their drivers and riders were hit and split up.


25. The arms, thighs, hands, hips, ears and feet were cut off. The banners, arrows, swords, coats of mail and excellent ornaments were slit and split.


26. The earth shone with heads divested of coronets but with earrings retained, strewn about and with thighs resembling trunks of elephants broken off during the tussle.


27. Severed arms with the ornaments and weapons still retained and other limbs too were lying scattered about like honeycombs.


28. The soldiers running in the battle field saw several headless bodies that jumped with many weapons lifted in their hands.


Continues....


🌹🌹🌹🌹🌹




2 views0 comments

Comentários


bottom of page