top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 872 / Sri Siva Maha Purana - 872

Updated: Apr 7, 2024



🌹 . శ్రీ శివ మహా పురాణము - 872 / Sri Siva Maha Purana - 872 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 36 🌴


🌻. దేవాసుర సంగ్రామము - 4 🌻


ఆ యుద్ధములో గొప్ప బల పరాక్రమములు గల వీరులు మిక్కుటముగా గర్జిస్తూ అనేకరకముల శస్త్రాస్త్రములతో ద్వంద్వ యుద్ధములను చేయుచుండిరి (29). కొందరు బంగరు అగ్రములు గల బాణములతో యుద్ధమునందు భటులను సంహరించి వర్షాకాలమేఘముల వలె వీరగర్జనలను చేయుచుండిరి (30). ఒక వీరుడు మరియొక వీరుని, ఆతని రథము మరియు సారథితో సహా, వర్షాకాల మేఘము సూర్యుని వలె, అన్నివైపులనుండి బాణపరంపరలతో కప్పివేసెను (31).


ద్వంద్వయుద్ధవీరులు పరస్పరము దాడిచేసుకొనుచూ, ఆహ్వానిస్తూ, ముందుకు దుముకుతూ, ఒకరి నొకరు మర్మస్థానములయందు గాయపరుస్తూ యుద్ధమునుచేసిరి (32). ఆ మహాయుద్ధములో వీరుల గుంపులు తమ చేతులతో ధ్వజములను, ఆయుధములను ధరించి సింహనాదములను చేయుచూ అంతటా కానవచ్చిరి (33). ఆ యుద్ధమునందు మహావీరులు మహానందము గలవారై గొప్ప ధ్వనిని చేయు తమ శంఖములను వేర్వేరుగా మ్రోయించి బిగ్గరగా కేకలను వేయుచుండిరి (34). ఈ విధముగా దేవదానవుల మధ్య చాలకాలము గొప్ప భయంకరమైన బీభత్సకరమైన యుద్ధము జరిగి వీరులకు ఆనందమును కలిగించెను (35). పరమాత్మ, మహాప్రభుడు అగు శంకరుని ఈ లీలచే దేవ, దావన, మనుష్యులతో సహా సర్వప్రాణులు మోహింప చేయబడుచున్నవి (36).


శ్రీ శివమహాపురాణములో రుద్రసంహిత యందలి యుద్ధఖండలో దేవదానవ యుద్ధ వర్ణనమనే ముప్పది ఆరవ అధ్యాయము ముగిసినది (36).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 872 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 36 🌴


🌻 Mutual fight - 4 🌻


29. With different kinds of miraculous and ordinary weapons and missiles, the heroes of great strength and valour fought one another shouting and leaping.


30. Some heroes killed the soldiers with their arrows fitted with goden tips and roared like water-laden rumbling clouds.


31. One hero fully encompassed another hero as well as his chariot and charioteer, by discharging heaps of arrows like the rainy season covering up the sun under the clouds.


32. Fighters of duel rushed against one another, challenging, thrusting and diving in at the vulnerable points.


33. Everywhere groups of heroes were seen in that terrible war roaring like lions with various weapons displayed in their hands.


34. The heroes in their joy shouted and leapt blowing on their conches of loud sound severally.


35. Thus for a long time the great combat between the gods and Dānavas continued, terrible and tumultuous but delightful to the heroes.


36. Such was the divine sport of the great lord Śiva, the great soul. Everyone including the gods, Asuras and human beings was deluded by it.



Continues....


🌹🌹🌹🌹🌹



1 view0 comments

Comments


bottom of page