top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 874 / Sri Siva Maha Purana - 874

🌹 . శ్రీ శివ మహా పురాణము - 874 / Sri Siva Maha Purana - 874 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 37 🌴


🌻. స్కందశంఖచూడుల ద్వంద్వయుద్ధము - 2 🌻


ఆ యుద్ధములో వేలాది మొండెములు అనేక రకములుగా నాట్యమాడినవి. పిరికి వారికి భయమును గొల్పు పెద్ద కోలాహలము చెలరేగెను (10). మరల స్కందుడు పెద్దగా కోపించి బాణముల వర్షమును కురింపించి, క్షణకాలములో కోటి మంది రాక్షస వీరులను నేల గూల్చెను (11). స్కందుని బాణ పరంపరచే తెగిన దేహములు కలిగి మరణించగా మిగిలిన దానవులందరు అపుడు పారిపోయిరి (12). వృషపర్వుడు, విప్రచిత్తి, దండుడు మరయు వికంపనుడు అను వారందరు వరుసగా స్కందునితో యుద్ధమును చేసిరి. (13). మహామారి కూడ వెన్ను చూపకుండా యుద్ధమును చేసెను. స్కందుని శక్తి- ఆయుధముచే వారు తెగిన అవయవములు గలవారై అధికమగు పీడను పొందిరి (14).


ఓ మునీ! అపుడు మహామారి, స్కందుడు విజయమును పొందిరి. స్వర్గములో దుందుభులు మ్రోగెను. పూల వాన కురిసెను (15). మిక్కిలి భయంకరము, అద్భుతము, ప్రకృతి శక్తులను బోలి దానవులను వినాశమొనర్చునది అగు ఆ స్కందుని సమరమును గాంచి (16), మహామారిచే చేయబడిన వినాశకరమగు ఆ ఉపద్రవమును కూడ గాంచి, అపుడు శంఖచూడుడు మిక్కిలి కోపించి వెంటనే స్వయముగా యుద్ధమునకు సన్నద్ధుడై (17), అనేక శస్త్రాస్త్రములతో గూడినది, దానవవీరులందరికీ అభయమునిచ్చునది, అనేక శ్రేష్ఠవస్తువులతో నిర్మితమైనది అగు శ్రేష్ఠవిమానమునెక్కి (18), మహావీరులతో గూడి యుద్ధరంగమునకు వెళ్లెను. ఆతడు ఆ విమానరూపమగు రథమధ్యములో నున్న వాడై ఆకర్ణాంతము నారిత్రాటిని లాగి బాణముల వర్షమును కురిపించెను (19). ఆతని ఆ బాణవర్షము భయంకరమైనది, నివారింపశక్యము కానిది. వధస్థానము వంటి ఆ యుద్ధభూమిలో మిక్కిలి భయంకరమగు చీకటి నెలకొనెను (20). దేవతలు, మరియు నందీశ్వరుడు మొదలగు ఇతరుల అందరు పరుగెత్తిరి. రణరంగములో స్కందుడు ఒక్కడు మాత్రమే నిలబడి యుండెను (21)



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 874 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 37 🌴


🌻 Śaṅkhacūḍa fights with the full contingent of his army - 2 🌻


10. Many thousands of headless bodies danced in the battle field. There was a great tumult that terrified the cowards.


11. Again Kārttikeya became furiously angry and showered volleys of arrows. He struck crores of leaders of the Asuras within a trice.


12. The Dānavas wounded in their bodies by the numerous arrows of Kārttikeya fled in fright. Those who remained were killed.


13. Vṛṣaparvan, Vipracitti, Daṇḍa, and Vikampana fought with Kārttikeya by turns.


14. Mahāmāri also fought. She was never routed. All of them afflicted by Kārttikeya’s spear were wounded.


15. O sage, Mahāmārī and Skanda won the battle. Big wardrums were sounded in the heaven. Showers of flowers fell down.


16-17. On seeing the wonderfully terrible fight of Kārttikeya that caused wastage in the rank and file of the Dānavas like natural disasters, as well as the harassment and havoc wrought by Mahāmāri, Śaṅkhacūḍa became furious and himself got ready for the battle.


18-19. He got into his excellent aerial chariot that contained different weapons and missiles, that was set in diamond and that encouraged and emboldened the heroes. Śaṅkhacūḍa drew the string of the bow upto his ear and discharged volleys of arrows from his seat in the middle of the chariot. He was accompanied by many heroes.


20. His volley of arrows was terrifying. It could not be withstood. A terrible darkness spread in the battlefield.


21. The gods Nandīśvara and others fled. Only Kārttikeya stayed behind in the battle field.



Continues....


🌹🌹🌹🌹🌹



0 views0 comments

Commenti


bottom of page