🌹 . శ్రీ శివ మహా పురాణము - 877 / Sri Siva Maha Purana - 877 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 38 🌴
🌻. భద్రకాళీ శంఖచూడుల యుద్ధము - 1 🌻
సనత్కుమారుడిట్లు పలికెను- ఆమె యుద్ధ రంగమునకు వెళ్లి సింహనాదమును చేసెను. ఆ దేవియొక్క నాదమును తాళజాలక దానవులు మూర్ఛను పొందిరి (1). ఆమె అమంగళకరమగు అట్టహాసమును పలుమార్లు చేసి మధువును త్రాగి యుద్ధరంగములో నాట్యము చేసెను (2). ఉగ్రదంష్ట్ర, ఉగ్రదండ, కోటవి అను పేర్లుగల దేవీ మూర్తులు కూడ ఇతర దేవీమూర్తులతో గూడి ఆ యుద్ధములో మధువును అధికముగా త్రాగి నాట్యమాడిరి (3). శివగణములలో మరియు దేవతల దళములలో అపుడు పెద్ద కోలాహలము బయలు దేరెను. దేవతలు, గణములు మరియు ఇతరులు అందరు అధికముగా గర్జిస్తూ ఆనందించిరి (4). కాళిని చూచి శంఖచూడుడు వెంటనే యుద్ధమునకు వచ్చెను. భయమును పొందియున్న దానవులకు ఆ రాక్షసరాజు అభయమునిచ్చెను. (5) కాళి ప్రళయకాలాగ్నిని బోలిన అగ్నిని విరజిమ్మెను. కాని ఆ దానవేంద్రుడు దానిని వెంటనే వైష్ణవాస్త్రముతో అవలీలగా త్రిప్పికొట్టెను (6). అపుడా దేవి వెంటనే అతనిపై నారాయణాస్త్రమును ప్రయోగించెను. ఆ దానవ వీరుని గాంచి ఆ అస్త్రము వర్ధిల్లెను (7).
ప్రళయకాలాగ్ని జ్వాలను బోలియున్న ఆ అగ్నిని గాంచి శంఖచూడుడు దండమువలె నేలపై బడి పలుమార్లు ప్రణమిల్లెను (8). వినీతుడై యున్న దానవుని ంచి ఆ ఆయుధము వెనుదిరిగెను. అపుడా దేవి మంత్రమును పఠించి బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను (9). ఆ దానవవీరుడు నిప్పులు గ్రక్కు చున్న దానిని గాంచి నేలపై నిలబడి ప్రణమిల్లి బ్రహ్మాస్త్రముతో దానిని తప్పించెను (10).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 877 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 38 🌴
🌻 Kālī fights - 1 🌻
Sanatkumāra said:—
1. Going to the battle ground, the goddess Kālī roared like a lion. On hearing that the Dānavas fainted.
2. She laughed boisterously again and again boding ill to the Asuras. She drank the distilled grapewine and danced on the battle ground.
3. The manifestations of Durgā viz—Ugradaṃṣṭrā (one with fierce fangs) Ugradaṇḍā (one with fierce baton) and Kotavī (the naked) danced on the battle ground and drank wine.
4. There was great tumult on the side of the Gaṇas and the gods. All the gods and the Gaṇas roared and rejoiced.
5. On seeing Kālī, Śaṅkhacūḍa hastened to the battle ground. The Dānavas were frightened but the king Śaṅkhacūḍa assured them of protection.
6. Kālī hurled fire as fierce as the flame of dissolution which the king put out sportively by means of Vaiṣṇava missiles.
7. Immediately the goddess hurled the Nārāyaṇa missile at him. The missile developed its power on seeing the Dānava Śaṅkhacūḍa.
8. On realising it as fierce as the flame of fire of dissolution, the Dānava Śaṅkhacūḍa fell flat on the ground and bowed again and again.
9. On seeing the Dānava humbled the missile turned away. Then the goddess hurled the Brahmā missile with due invocation through the mantra.
10. On seeing the missile blazing he bowed and fell on the ground. The leader of the Dānavas thus prevented the Brahmā missile from attacking him.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments