top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 878 / Sri Siva Maha Purana - 878



🌹 . శ్రీ శివ మహా పురాణము - 878 / Sri Siva Maha Purana - 878 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 38 🌴


🌻. భద్రకాళీ శంఖచూడుల యుద్ధము - 2 🌻


అపుడా దానవవీరుడు కోపించి వేగముగా ధనుస్సును ఎక్కుపెట్టి మంత్రములను పఠిస్తూ దేవిపై దివ్యాస్త్రములను ప్రయోగించెను (11). ఆమె విశాలమగు నోరును తెరచి ఆ అస్త్రమును ఆహారమును వలె భుజించి గర్జించి అట్టహాసమును చేయగా దానవులు భయపడిరి (12). ఆతడు వందయోజనముల వెడల్పు గల శక్తిని కాళిపై ప్రయోగించగా, ఆ దేవి అనేక దివ్యాస్త్రములతో దానిని వంద ముక్కలుగా చేసెను (13). ఆతడు చండికపై వైష్ణవాస్త్రమును ప్రయోగించగా, ఆమె మహేశ్వరాస్త్రముతో దానిని తప్పించెను (14).


ఈ తీరున వారిద్దరి మధ్య చిరకాలము యుద్ధము జరిగెను. దేవదానవులందరు ప్రేక్షకులుగా నుండి పోయిరి (15). అపుడు యుద్ధములో మృత్యుసమానురాలగు కాళీమహాదేవి కోపించి మంత్రముచే పవిత్రమైన పాశుపతాస్త్రమును స్వీకరించెను (16). దానిని ప్రయోగించుటకు పూర్వమే ఆపివేయుటకై ఆకాశవాణి ఇట్లు పలికెను : ఓ దేవీ! కోపముతో ఈ అస్త్రమును శంఖచూడునిపై ప్రయోగించకుము (17). ఓ చండికా! పాశుపతాస్త్రము అమోఘమైనదే అయినా వీనికి దానివలన మరణము రాదు. వీరుడగు శంఖచూడుని వధించుటకు మరియొక ఉపాయము నాలోచించుము (18). ఈ మాటను విని భద్రకాళి ఆ అస్త్రమును ప్రయోగించలేదు. అపుడామె ఆకలితో కోటి మంది దానవులను అవలీలగా తినివేసెను (19).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 878 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 38 🌴


🌻 Kālī fights - 2 🌻


11. Then the infuriated leader of the Dānavas drew the bow violently and discharged divine missiles at the goddess with due invocation through the mantras.


12. Opening the mouth very wide she swallowed the missiles and roared with a boisterous laugh. The Dānavas were terrified.


13. He then hurled a Śakti, a hundred Yojanas long at Kālī. By means of divine missiles she broke it into a hundred pieces.


14. He hurled the Vaiṣṇava missile on Kālī. She blocked it with the Māheśvara missile.


15. Thus the mutual combat went on for a long time. All the gods and Dānavas stood as mere onlookers.


16. Then the infuriated goddess Kālī, as fierce as the god of death on the battleground, took up angrily the Pāśupata arrow sanctified by mantras.


17. In order to prevent it from being hurled, an unembodied celestial voice said—“0 goddess, do not hurl this missile angrily at Śaṇkhacūḍa.”


18. “O Caṇḍikā, death of this Dānava will not take place even through the never failing Pāsupata missile. Think of some other means for slaying this warrior Śaṅkhacūḍa.”


19. On hearing this, Bhadrakālī did not hurl the missile. Sportively she devoured ten million Dānavas as if in hunger.



Continues....


🌹🌹🌹🌹🌹



0 views0 comments

Opmerkingen


bottom of page