top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 880 / Sri Siva Maha Purana - 880



🌹 . శ్రీ శివ మహా పురాణము - 880 / Sri Siva Maha Purana - 880 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 38 🌴


🌻. భద్రకాళీ శంఖచూడుల యుద్ధము - 4 🌻


ప్రతాపశాలియగు ఆ శంఖచూడుడు మరుక్షణములో తెలివిని పొంది లేచి నిలబడెను. ఆమె యందు తల్లి యను భావన కలవాడగుటచే ఆమెతో బాహుయుద్ధమును ఆతడు చేయలేదు (29). ఆ దేవి మహాకోపముతో ఆ దానవుని పట్టుకొని పలుమార్లు గిరగిర త్రిప్పి పైకి వేగముతో విసిరివేసెను (30).


ప్రతాపవంతుడగు శంఖచూడుడు వేగముగా పైకి ఎగిరి మరల క్రిందకు దిగి నిలబడి భద్రకాళికకు ప్రణమిల్లెను (31). ఆతడు ఆనందముతో నిండిన మనస్సు గలవాడై శ్రేష్ఠమగు రత్నములతో గొప్ప కౌశలముతో నిర్మించబడిన మిక్కిలి అందమగు విమానము నధిరోహించెను. ఆ మహాయుద్ధములో ఆతడు కంగారు పడలేదు (32). ఆ కాళి ఆకలితో దానవుల రక్తమును త్రాగెను. ఇంతలో అచట ఆకాశవాణి ఇట్లు పలికెను (33). ఇంకనూ గర్వించి యున్న లక్ష మంది దానవవీరులు గర్జిస్తూ యుద్ధరంగములో మిగిలి యున్నారు. ఓ ఈశ్వరీ! నీవు వారిని భక్షించుము (34). యుద్ధములో శంఖచూడుని సంహరించవలెనని కోరకుము. ఓదేవీ! ఆ దానవవీరుడు నీ చేతిలో మరణించడు. ఇది నిశ్చయము (35). ఆకాశమునుండి వెలుబడిన ఆ పలుకులను విని ఆ భద్రకాళీదేవి అపుడు అనేకమంది దానవుల రక్తమును త్రాగి మాంసమును తిని శంకరుని సన్నిధికి వచ్చి యుద్ధములో జరిగిన ఘటనలను ముందు వెనుకల క్రమమును తప్పకుండ చెప్పెను (36, 37).


శ్రీ శివ మహా పురాణములో రుద్ర సంహిత యందలి యుద్ధ ఖండలో కాళీయుద్ధ వర్ణనమనే ముప్పది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (38).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 880 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj


🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 38 🌴


🌻 Kālī fights - 4 🌻


29. Immediately the Dānava regained consciousness and got up valorously. He did not fight her with his arms by the thought that she was a woman like his mother.


30. The goddess seized the Dānava, whirled him again and again and tossed him up with great anger and velocity.


31. The valorous Śaṅkhacūḍa fell down after being tossed up very high. He got up and bowed down to Bhadrakālī.


32. Highly delighted thereafter, he got into a beautiful aerial chariot of exquisite workmanship set with gems and did not lose the balance of his mind in the battlefield.


33. Hungrily Kālī drank the blood of the Dānavas. In the meantime an unembodied celestial voice said:


34. O goddess, a hundred thousand haughty leading Dānavas have been left out in the battle still roaring. Devour them quickly.


35. Do not think of slaying the king of Dānavas. O goddess, Śaṅkhacūḍa cannot be killed by you. It is certain.


36-37. On hearing these words from the firmament, Bhadrakālī drank the blood and devoured the flesh of many Dānavas and went near Śiva. She then narrated to him the events of the war in the proper order.



Continues....


🌹🌹🌹🌹🌹


0 views0 comments

Comments


bottom of page