top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 881 / Sri Siva Maha Purana - 881

🌹 . శ్రీ శివ మహా పురాణము - 881 / Sri Siva Maha Purana - 881 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 39 🌴


🌻. శంఖచూడుని సైన్యమును వధించుట - 1 🌻


వ్యాసుడిట్లు పలికెను- కాళి యొక్క వచనములను విని ఈశానుడు ఏమనినాడు? ఏమి చేసినాడు? ఓ మహాబుద్ధి శాలీ! నీవా విషయమును చెప్పుము. నాకు చాల కుతూహలముగ నున్నది (1).


సనత్కుమారుడిట్లు పలికెను - కాళి యొక్క మాటలను విని, పరమేశ్వరుడు, గొప్ప లీలలను చేయువాడు, మంగళకరుడు నగు శంభుడు నవ్వి ఆమెను ఓదార్చెను (2). ఆకాశవాణి యొక్క పలుకులను తెలుసుకొని, తత్త్వ జ్ఞాన పండితుడగు శంకరుడు తన గణములతో గూడి స్వయముగా యుద్ధమునకు వెళ్లెను (3). మహేశ్వరుడు గొప్ప వృషభము నెక్కి, వీరభద్రాదులు తోడు రాగా, తనతో సమానమైన భైరవులు, క్షేత్రపాలురు చుట్టువారి యుండగా, వీరరూపమును దాల్చి రణరంగమును చేరెను. అచట ఆ రుద్రుడు మూర్తీభవించిన మృత్యువువలె అధికముగా ప్రకాశించెను (4, 5). ఆ శంఖచూడుడు శివుని గాంచి విమానమునుండి దిగి పరమభక్తితో శిరస్సును నేలపై ఉంచి సాష్టాంగ నమస్కారమును చేసెను (6). ఆతడు శివునకు ప్రణమిల్లిన పిదప యోగశక్తిచే విమానము నధిష్ఠించి వెంటనే ధనుర్బాణములను గ్రహించి యుద్ధమునకు సన్నద్ధుడాయెను (7).


వారిద్దరు అపుడు వర్షించే రెండు మేఘముల వలె భయంకరమగు బాణవర్షమును కురిపిస్తూ వందసంవత్సరములు చేసిరి (8). మహావీరుడగు శంఖచూడుడు భయంకరములగు బాణములను ప్రయోగించగా, శంకరుడు వాటిని తన బాణపరంపరలచే అవలీలగా చీల్చివేసెను (9).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 881 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj


🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 39 🌴


🌻 The annihilation of the army of Śaṅkhacūḍa - 1 🌻



Vyāsa said:—


1. O intelligent one, on hearing the narrative of Kālī what did Śiva say? What did he do? Please narrate to me. I am eager to know it.



Sanatkumāra said:—


2. On hearing the words of Kālī, lord Śiva, the actor of great divine sports, laughed. Śiva consoled her.


3. On hearing the celestial voice, Śiva, an expert in the knowledge of principles, went himself to the battle along with his Gaṇas.


4. He was seated on his great bull and surrounded by Vīrabhadra and others, the Bhairavas and the Kṣetrapālas all equal in valour to him.


5. Assuming a heroic form, lord Śiva entered the battle ground. There Śiva shone well as the embodied form of the annihilator.


6. On seeing Śiva, Śaṅkhacūḍa got down from the aerial chariot, bowed with great devotion and fell flat on the ground.


7. After bowing to him he immediately got into his chariot. He speedily prepared for the fight and seized the bow and the arrows.


8. The fight between Śiva and the Dānava went on for a hundred years and they showered arrows fiercely like clouds pouring down incessantly.


9. The heroic Śaṅkhacūḍa discharged terrible arrows playfully. Śiva split all of them by means of his arrows.



Continues....


🌹🌹🌹🌹🌹



0 views0 comments

Comments


bottom of page