🌹 . శ్రీ శివ మహా పురాణము - 882 / Sri Siva Maha Purana - 882 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 39 🌴
🌻. శంఖచూడుని సైన్యమును వధించుట - 2 🌻
ముక్కంటి, దుష్టశిక్షకుడు, శిష్టరక్షకుడు నగు మహారుద్రుడు కోపించి వాని అవయవములను శస్త్రపరంపరలతో కొట్టెను (10). అపుడా రాక్షసుడు పదునైన ఖడ్గమును, డాలును తీసుకొని శివుని శ్రేష్ఠవాహనమగు వృషభమును శిరస్సుపై వేగముగా కొట్టెను (11). వాహనమీ తీరున కొట్టబడగా రుద్రుడు వాని ఖడ్గమును మరియు గొప్పగా ప్రకాశించే డాలును అవలీలగా శీఘ్రమే తన క్షురప్రమనే ఆయుధముతో విరుగగొట్టెను (12). తన డాలు విరుగగానే ఆ రాక్షసుడు అపుడు శక్తిని ప్రయోగించెను. తన మీదకు వచ్చుచున్న ఆ శక్తిని హరుడు తన బాణముతో రెండు ముక్కలుగా చేసెను (13). కోపముతో మండిపడిన శంఖచూడాసురుడు చక్రమును ప్రయోగించెను. హరుడు వెంటనే దానిని కూడ తన పిడికిలితో కొట్టి చూర్ణము చేసెను (14). ఆతడు వెంటనే గదను వేగముతో శివుని పైకి విసిరెను. శంభుడు దానిని కూడ వెంటనే విరిచి బూడిద చేసెను (15).
అపుడు దానవచక్రవర్తి యగు శంఖచూడుడు చేతితో గొడ్డలిని పట్టుకొని క్రోధముతో వ్యాకులుడై వేగముగా శివుని పైకి పరుగెత్తెను (16). గొడ్డలి చేతియందు గల ఆ రాక్షసుని శంకరుడు వెంటనే తన బాణపరంపరలచే కప్పివేసి అవలీలగా నేలపై బడవేసెను (17). తరువాత ఆతడు క్షణములో తెలివిని దెచ్చుకొని దివ్యములగు ఆయుధములను బాణములను ధరించి మంచి రధమునెక్కి ఆకాశమునంతనూ వ్యాపించి ప్రకాశించెను (18).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 882 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj
🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 39 🌴
🌻 The annihilation of the army of Śaṅkhacūḍa - 2 🌻
10. Mahārudra, the odd-eyed Śiva, the punisher of the wicked and the goal of the good, angrily hit his limbs with various weapons.
11. Taking up his sharp sword and the leather shield the Dānava rushed at the sacred bull of Śiva and hit it on its head.
12. When his bull was hit, Śiva sportively cut off the sword and the shining shield by means of his Kṣurapra.
13. When the shield was split, the Asura hurled his spear. Śiva split it into two with his arrow as it came before him.
14. The infuriated Dānava, Śaṅkhacūḍa hurled a discus. Immediately Śiva smashed it into pieces with his fist.
15. He hurled his club with force at Śiva. Rapidly split by Śiva, the club was reduced to ashes.
16. Then seizing an axe with his hand, the infuriated king of Dānavas, Śaṅkhacūḍa rushed at Śiva.
17. By the volley of his arrows Śiva sportively struck the Asura with axe in his hand.
18. The Dānava quickly regained consciousness and got into his excellent chariot. With divine weapons and arrows he encompassed the whole sky and shone.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments