శ్రీ హనుమద్ వ్రతం - Hanuman Vratam - Wednesday, December 3, 2025, Margasira Shukla Paksha, Trayodashi
- Prasad Bharadwaj
- Dec 3
- 1 min read

🌹శ్రీ హనుమద్ వ్రతం - Hanuman Vratam డిసెంబర్ 3 బుధవారం 2025, మార్గశిర శుక్లపక్షం, త్రయోదశి 🌹
🔥 హనుమద్ వ్రతం ఎందుకు చేస్తారు - విశిష్టత 🔥
ప్రసాద్ భరద్వాజ
పరాశర సంహిత దీని గురించి చెప్పింది. పదమూడు క్షేత్రములున్నాయి. వాటిని హనుమత్ పీఠములు అని పిలుస్తారు. వాటిలో పంపాతీరం ఒక పీఠం. చంద్రవంశంలో సోమదత్తుడు అనే ఒక రాజు జన్మించాడు. ఆయనకి రాజ్య భ్రష్టత్వము వచ్చింది. ఆ కాలంలో అప్పటికప్పుడు విజయం కలగాలంటే ఏ వ్రతము చేయాలి? అన్నారు. పంపానదీతీరంలో కూర్చొని మార్గశిర త్రయోదశినాడు చేసే వ్రతం అనుకోకుండా తిథి వచ్చింది. ఇప్పటికిప్పుడు విజయాన్ని ఇవ్వగలిగిన వ్రతం అది అని రాజుతో ఆ వ్రతం చేయించారు. రాజుగారు పరమ భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని చేశారు. హనుమద్ వ్రతం చేసిన ఉత్తర క్షణంలో హనుమయొక్క అనుగ్రహం కలిగి అపారమైన సైన్యం అక్కడికక్కడ దొరికింది. అరణ్యంలో ఉన్న వీరులందరూ తోడు వచ్చారు. తన రాజ్యాన్ని తాను పొందాడు. ఇలా వ్రతం చేశాడు, సాయంత్రానికి మూర్ధాభిషిక్తుడై పోయాడు. ఆనాటి నుంచి చంద్రవంశ ప్రభువైన సోమదత్తుడు చేసి ఫలితమును పొందిన మహోత్రుష్టమైన వ్రతము కనుక ఇప్పటికీ మార్గశీర్ష మాసంలో శుద్ధ త్రయోదశి తిథి నాడు హనుమద్ వ్రతమును చేస్తారు.
🌹🌹🌹🌹🌹


Comments