top of page

హోళీ పండుగ శుభాకాంక్షలు Happy Holi హోళీ పండుగ ఎలా జరుపుకోవాలి How to celebrate Holi festival

Writer: Prasad BharadwajPrasad Bharadwaj


🌹 హోళీ పండుగ శుభాకాంక్షలు మిత్రులందరకి 🌹


ప్రసాద్‌ భరధ్వాజ


🍀 హోళీ పండుగ ఎలా జరుపుకోవాలి - విధి విధానాలు 🍀


ఉత్తరభారతంలో హోళీని రెండు రోజుల పండగగా చేసుకుంటారు. మొదటి రోజును హోలికా దహన్‌ లేదా చోటీ హోళీ అని రెండో రోజును రంగ్‌ వాలీ హోళీ. ధులేటి , ధుళంది , ధూళి వందన్‌ వంటి పేర్లతో పిలుస్తారు. వీరు రెండో రోజుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. దీనిని విభేదాలను మరిచి స్నేహం పెంపొందించుకునే సమయంగా కూడా భావిస్తారు. ఈ రోజు రంగులు చల్లుకోవడంలో తెలిసినవారు , కొత్తవారు అనే భేదం లేకుండా అందరినీ వర్ణ ప్లావితం చేయడం జరుగుతుంది.


హోళీ లేదా రంగుల పండుగగా మనం జరుపుకునే పండగ అసలు పేరు హోళికా పూర్ణిమ. ఇది రెండు రోజుల పండగ అయినందున కొన్ని ప్రాంతాల్లో మొదటి రోజు కొన్ని ప్రాంతాల్లో రెండో రోజు చేస్తారు. ఇది ఈనాడు రంగులు చల్లుకునే ఉత్సవంగానే మారిపోయింది గాని ఈ రోజున ఆచరించాల్సిన వేరే విధి విధానాలూ ఉన్నాయి.


ఉదయాన్నే కట్టెలు , పిడకలు రాశిగా పోసి నిప్పును రాజేసి దానిపైకి హోళికా అనే శక్తిని అవహింపజేసి ‘శ్రీ హోళికాయైనమః’ అని పూజించి మూడు సార్లు అగ్నికి ప్రదక్షిణం చేస్తూ ‘వందితాసి సురేంద్రేణ బ్రాహ్మణాశంకరేణచ , అతస్త్వాం పాహినో దేవి భూతే భూతి ప్రదో భవ’ అనే శ్లోకం చదవాలని పెద్దలు చెబుతారు. ఆ తర్వాతే రంగులను చల్లడం , రంగునీటితో ఉత్సవం జరుపుకోవడం చేయాలని శాస్త్త్ర వచనం.


హోలీ పండగకు సంబంధించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని నిప్పుల్లో పడేసి కాల్చాలనుకోవడం అందుకు ప్రహ్లాదుని అత్త హోళిక పూనుకోవడం ప్రహ్లాదునితో బాటు అగ్నిలో దూకడం కథ అందరికీ తెలసిందే. అయితే ఆమె కూడా పునీతురాలైంది కనుక హోలీ రోజు ఉదయాన్నే అగ్నిని రగిల్చి ఆమెను ఆవాహన చేయడం , హోళికాయైనమః అని స్మరించే ఆచారం వచ్చిందని అంటారు. మరో పక్క హోళిక మరణించిన తిథి ఇదే అయినందున ఈ రోజు హోలీ పండగ చేసుకుంటారని అంటారు. ఈ మంటనే చెడుపై మంచి విజయంగా కొందరు అభివర్ణిస్తారు. హోళిక చెడుకు సంకేతమని అగ్ని జ్ఞానాగ్ని అని వారి భావన.


ఉత్తర భారతంలో కృష్ణుడు పెరిగిన ప్రదేశంగా భావించే వ్రజభూమిలో మరో కథ ప్రచారంలో ఉంది. కృష్ణుడు నల్లగా ఉండడం , రాధ ఇతరులు తెల్లగా ఉండడం చూసి వారిని ఈ ఒక్క రోజు రంగులను పూసుకుని నల్లగా మారాలని కోరాడని భావిస్తారు.


🌹🌹🌹🌹🌹



Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page