*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 57 / Agni Maha Purana - 57 🌹* *✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు* *ప్రథమ సంపుటము, అధ్యాయము - 21* *సేకరణ : ప్రసాద్ భరద్వాజ* *శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.* *🌻. విష్ణ్వాది దేవతా సామాన్య పూజా నిరూపణ - 2 🌻* ఇపుడు సామాన్య శివపూజ చెప్పబడుచున్నది. ప్రారంభమున నందిని పూజించవలెను. మహాకాలుని, గంగను, యమునను, గణాదులను, గీర్దేవిన, లక్ష్మిని, గురువును, వాస్తుపురుషుని, ఆధార శక్త్యాదులను, ధర్మాదులను పూజించవలెను. వామ, జ్యేష్ఠ, రౌద్రి, కాలి, కలవికరిణి, బలవికరిణి, బలప్రమథని, సర్వభూతదమని, మనోన్మని, శివ అను తొమ్మండుగురు శక్తులను పూజింపవలెను. ''హాం. హూం. హాం శివమూర్తయే నమః'' అను మంత్రముతో ఆయా ఆవయవములను, ముఖములను పూజించుచు శివుని పూజించవలెను. ''హౌం శివాయ హౌం'' అని శివుని, 'హాం ' అను బీజాక్షరముతో ఈశానముఖమును పూజింపవలెను. ''హ్రీం'' అను బీజాక్షరముతో గౌరిని ''గం' అను బీజాక్షరముతో గణమును (గణాధిపతిని) పూజింపవలెను. ఇంద్రుడు మొదలగు వారిని చండుని, హృదయము మొదలగు వాటిని క్రమముగ పూజించవలెను. ఇపుడు సూర్యర్చన మంత్రములు చెప్పబడుచున్నవి. ముందుగా దండిని పిదప పింగళుని పూజించవలెను. ఉచ్చైః శ్రవస్సును, అరుణుని పూజించి ప్రభూతుని, విమలుని, సోముని, సంధ్యలను, పరసుఖుని, స్కందాదులను మధ్మయందు పూజింపవలెను. దీప్తా, సూక్ష్మా, జయా, భద్రా, విభూతి, విమలా, అమోఘా, విర్యుతా, సర్వతోముఖీ అను నవశక్తులను పూజింపవలెను. ''హం'' ''ఖం'' ''ఖం'' అను బీజాక్షరములచే అర్కాసనమును ''సోత్కాయనమః అని మూర్తిని ''హాం హ్రీం సః సూర్యాయ నమః'' అని సూర్యుని, ''ఆం నమో హృదయాయ'' అని హృదయమును పూజింపవలెను. ''ఓం అర్కాయ నమః అని శిరస్సున పూజించవలెను అట్లే అగ్ని - ఈశ - అసుర - వాయువులను అధిష్ఠించి యున్న సూర్యుని పూజింపవలెను. ''భూః '' భువః స్వః జ్వాలిన్యై శిఖాయైనమః అని శిఖయు ''హుం'' అని కవచమును ''భాం'' అని నేత్రములను, హ్రః, అని అర్కాస్రమును పూజించవలెను. రాజ్ఞియను సూర్యశక్తిని, దానినుండి ప్రకటితయగ ఛాయాదేవిని పూజించవలెను. సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Agni Maha Purana - 57 🌹* *✍️ N. Gangadharan* *📚. Prasad Bharadwaj * *Chapter 21* *🌻 Method of worshipping Viṣṇu and other gods - 2 🌻* 10-11. (Then) the speech, the goddess of prosperity, the preceptor, the Vāstu (deity), the different female energies and Dharma (the lord of death) and other gods (are worshipped). (The female energies) Vāmā, Jyeṣṭhā, Raudrī, Kālī, Kalavikariṇī, Balavikariṇī, Balapramathinī, Sarvabhūtadamanī, Manomanī and Śivā (are worshipped) in the due order. 12. (Saying) Hām, Hum, Ham (salutation) to the form of Śiva, Śiva is worshipped along with his limbs and mouth. Haum, (salutation) to Śiva, Haum and Hām (salutations) to Īsāna (one of the Pañcabrahman forms of Śiva) and other faced (forms of Śiva). 13. Hrim (salutation) to Gaurī (Pārvatī), Gam (salutation) to Gaṇa, face of Śakra (Indra), Caṇḍa, heart and others. The mystic syllables in the worship of the sun (are described now). The tawny-coloured Daṇḍin is to be worshipped. 14. One should adore Uccaiḥśravas (the horse of Indra), the very much pure Aruṇa (younger brother of the Sun-god). The moon and the twilight, the other faces and Skanda (progeny of Śiva) in the middle are worshipped. 15. Then (the female divinities) Dīptā, Sūkṣmā, Jayā, Bhadrā, Vibhūti, Vimalā, Amoghā, Vidyutā and Sarvatomukhī are worshipped. 16. Then the mantra Ham, Kham, Kham for the firebrand (is used for the worship) of the seat of the sun and (his) form. Hrām, Hrīm, salutation to the sun, Ām, salutation to the heart. 17. (Salutation) to the (rays of the) sun, to his head, and similarly to the flames reaching up the regions of demons,. wind, earth, ether, and heavens. Hum is remembered as the mystic amulet. 18. (Salutations are made) to the lustre, eye, Hraḥ, to the weapons of Sun, Rāji, Śakti, and Niṣkubha. Continues.... 🌹 🌹 🌹 🌹 🌹 #అగ్నిపురాణం #AgniMahaPuranam https://t.me/AgniMahaPuranam https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://chaitanyavijnanam.tumblr.com/
top of page
bottom of page
Comments