top of page
Writer's picturePrasad Bharadwaj

Agni Maha Purana - 77 / శ్రీ మదగ్ని మహాపురాణము - 77



🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 77 / Agni Maha Purana - 77 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు


ప్రథమ సంపుటము, అధ్యాయము - 27


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


🌻. దీక్షా విధి - 3 🌻


పాదాంగుష్ఠము మొదలు శిఖ వరకు పొడవు గల ఆరు పేట్ల ఎఱ్ఱటి దారమును కన్యచేత భేదింపచేసి, మరల దానిని మూడు పేటలు చేసి, దానిపై, ఏ ప్రకృతిలో విశ్వము లీనమగునో, దేనినుండి జనించునో అట్టి ప్రకృతిని వివిధ ప్రక్రియలతో భావన చేయవలెను.


ఆ సూత్రముతో, ఎన్ని తత్త్వము లున్నవో అన్ని ప్రాకృతికపాశములను ముడివేసి, దానిని మూకుడులో అగ్ని కుండపార్శ్వమునందుంచి, గురువు, ప్రకృతి మొదలు పృథివి వరకున ఉన్న ఆ తత్త్వములను స్పష్టిక్రమానుసారము ధ్యానించుచు శిష్యుని శరీరముపై న్యాసము చేయవలెను.


వికృతుల క్రమము ప్రకారము నిఖిలమార్గమును పంచాంగములతో, తన్మాత్రాత్మకమగు మాయాసూత్రమైన పశువు శరీరమునందు ఉపసంహరించి, తత్త్వచింతకులు అచట ఐదు, పది, లేదా పండ్రెండు విధములచే ఆ గ్రథితమైన సూత్రమున పర్వ భేదముచే ఇవ్వవలెను.


తన ఇచ్ఛననుసరించి, సూత్రమునందును, దేహమునందును - ప్రకృతి, లింగశక్తి కర్త, బుద్ధి, మనస్సు తన్మాత్రలు, జ్ఞానేంద్రియము, కర్మేంద్రియములు పంచభూతములు - వీటినన్నింటిని, ద్వాదశాత్మను ధ్యానించవలెను. సృష్ట్యనులోమవిలోమక్రమములచే ఒక్కొక్క శతము హోమములు చేసి, పిమ్మట పూర్ణాహుతి ఇచ్చి, మూకుడులో సంపుటముగా చేసి, కుంభీశునకు నివేదనము చేయవలెన.


ఈ విధముగ, శాస్త్రానుసారముగా, అధివాసితము చేసి; భక్తుడై శిష్యునికి దీక్ష ఇవ్వవలెను. కరణి, కర్తరి, రజస్సులు, ఖటిక, ఇంకను ఉపయుక్తములైన వస్తువులు, వీటి నన్నింటిని ఆతని ఎడమ ప్రక్క దగ్గరగా ఉంచి, మూల మంత్రముచే స్పృశించి, అదివాసితములు చేయవలెను.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 77 🌹


✍️ N. Gangadharan

📚. Prasad Bharadwaj


Chapter 27


🌻 Mode of performing the initiation rite - 3 🌻


23. One should then take up a red thread spun by a maiden and measure it six times from the tuft of the hair to the toe and again multiply it three times.


24. Then one should meditate on the Prakṛti in which the universe lies and from which the universe is born, as being present there,.


25. Having tied the nooses of Prakṛti proportional to the number of principles, that thread is placed on an earthen vessel near the pit.


26. Then having meditated upon the principles commencing with the Prakṛti to the earth, following the order of creation, the spiritual teacher should assign them to the body of the disciple.


27. Those (principles), one, five, ten or twelve[5] may be tied individually and given by those who devote their thought on the principles.


28-29. With the five organs of action (one has to create) the entire universe in the order of evolution. Having drawn the subtle principles into one’s self and (having placed) the rope of illusion on the animal, the nature is taken as the creative power, the intellect or the mind as the agent, the five subtle principles as born of intellect and the five elements from the organs of action.


30-31. One has to meditate on these twelve principles in the rope as well as in the body according to his desire. Having made oblations with the residue of offerings according to the order of creation, and hundred oblations to each and every (principle) and then the final oblation, the earthen vessel is covered and is dedicated to the presiding deity of the pot.


32-33. Having duly performed the initial consecration, the devoted disciple is initiated. Then in a place where the wind blows, an arrow of a particular shape and a knife made either of silver or iron as well as all necessary materials are placed; and touched with the principal mystic syllable he should perform the initial consecration ceremony.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹



Comments


Post: Blog2 Post
bottom of page