top of page

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 129 🌹 సమయస్ఫూర్తి - 2




*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 129 🌹* *✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్* *సేకరణ : ప్రసాద్ భరద్వాజ* *🌻 99. సమయస్ఫూర్తి - 2🌻* *కార్యములకు కాలము నిర్ణయించు వారు, కాలము ననుసరించుటలో సూక్ష్మ లోకము నందు వారికి తెలియకయే మార్గమును పటిష్టము గావించు కొనుచున్నారు. విఘ్నములను లోయలపై తెలియకయే సూక్ష్మమగు వంతెనలను నిర్మించు కొనుచున్నారు. కాలానుగుణ్యముగ జీవితమును నడుపుకొను వారిని కాలమే అన్ని సమస్యల నుండి ఉద్ధరించును.* *సమస్యలు కలిగినపుడు తగు స్ఫూర్తి నిచ్చును. ధర్మజుడట్లే నడచెను. యక్ష ప్రశ్నల సమయమున, నహుష ప్రశ్నల సమయమున, స్వర్గారోహణ సమయమున, అతని కందిన పరిష్కారము, అతని స్ఫూర్తి నుండి కలిగిన పరిష్కారమే. ఆ స్ఫూర్తి సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి, కాలము యొక్క అనుగ్రహమే. సమయపాలనమే వలసిన దీక్ష.* *సశేషం.....* 🌹 🌹 🌹 🌹 🌹 #మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #ChaitanyaVijnanam #PrasadBhardwaj https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/maharshiwisdom/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://chaitanyavijnanam.tumblr.com/

Komentáře


Post: Blog2 Post

©2022 by DailyBhaktiMessages. Proudly created with Wix.com

  • Facebook
  • Twitter
  • LinkedIn
bottom of page