top of page
Writer's picturePrasad Bharadwaj

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 128 🌹



*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 128 🌹* *✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్* *సేకరణ : ప్రసాద్ భరద్వాజ* *🌻 99. సమయస్ఫూర్తి - 1🌻* *కార్యములకు శుభలగ్నములు, తేదీలు నిర్ణయించు కొనుట వానిని సకాలమున పూర్తి గావించు కొనుట ఒక క్రమశిక్షణ. దైనందిన జీవితమున నిదురలేచుటకు, స్నానాదికములను గావించు కొనుటకు, దైవప్రార్థనలు నిర్వర్తించుకొనుటకు, దైనందిన కార్యముల కొరకు ఆహార విహారముల కొరకు కాలనిర్ణయము జరుగవలెను. కాలమును నిర్ణయించి పాటించిన వారికి సంకల్పబలము పెరుగును. బలము సంకల్పసిద్ధిని కూడ నిచ్చును.* *కాలము విషయమున అశ్రద్ధ పనికి రాదు. అలసత్వముండ రాదు. నిర్ణీత సమయమునకు కార్యములు నిర్వర్తించువారు సమర్థులు కాగలరు. సర్వసమర్థతకు సమయ పాలనమే ముఖ్యము. సూర్యచంద్రులు, గ్రహగోళాదులు కాలమునే దైవముగ భావించి ప్రవర్తింతురు. అట్లే సమస్త దేవతలును. కాలమును వ్యర్థము చేయువారు, నిజమగు వ్యర్థులు. వారు ఊబినేలపై నడుచునటు వంటివారు. ఇట్టి వారియందు అశ్రద్ధ, సోమరితనము తెలియకయే పెరిగి, తామున్న స్థితి నుండి కూడ దిగజారుట జరుగును.* *సశేషం.....* 🌹 🌹 🌹 🌹 🌹 #మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #ChaitanyaVijnanam #PrasadBhardwaj https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/maharshiwisdom/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://chaitanyavijnanam.tumblr.com/

Comments


Post: Blog2 Post
bottom of page