*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 376 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 376 -2 🌹* *🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻* *✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్* *సేకరణ : ప్రసాద్ భరద్వాజ* *మూల మంత్రము :* *🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁* *🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।* *శృంగార రస సంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀* *🌻 376 -2. 'శృంగార రస సంపూర్ణా' 🌻* *హృదయము సహస్రారమునకును, మూలాధారమునకును నడుమ గల క్షేత్రము. పరమశివుడు హృదయము వరకు వచ్చి, మూలాధారమునుండి హృదయమును చేరిన పార్వతి నందు కొనును. మూడు లోకములు దాటి నాలుగవ లోకమునకు చేరిన జీవునిపై మూడు లోకముల నుండి దిగివచ్చి దేవుడందు కొనును.* *రాముని కొరకై వేచియున్న సీతను రాముడే మిథిలకు వచ్చి పెండ్లియాడుట, కృష్ణుని కొరకై వేచియున్న రుక్మిణీదేవిని కృష్ణుడే వచ్చి పెండ్లియాడుట, దేవుని కొరకు వేచియున్న జీవునికి, దేవుడే సాన్నిధ్య మిచ్చుట జరుగును. దైవమును గూర్చి వేచియుండుటకు హృదయమే నిజమగు స్థానము. పార్వతి, సీత, రుక్మిణి భక్తులు. దైవమును గూర్చి హృదయముననే వేచియుండి సాన్నిధ్యము పొంది ఏకత్వము చెందిరి. పై తెలిపిన సమాగమమున ఆనందము పరాకాష్ఠను చేరును. అట్టి స్థితిలో శ్రీమాత సంపూర్ణమగు ఆనంద స్వరూపిణిగ భాసించును.* *సశేషం...* 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 376-2 🌹* *Contemplation of 1000 Names of Sri Lalitha Devi* *✍️. Acharya Ravi Sarma * *📚. Prasad Bharadwaj* *🌻 82. Kameshari prananadi krutagyna kamapujita* *Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻* *🌻 376 - 2. Śṛṅgāra-rasa- saṁpūrṇā शृङ्गार-रस-संपूर्णा 🌻* *This nāma talks about the essence of love that She exhibits while being with Śiva, all alone. The love between Śiva and Śaktī is beautifully described in various scriptures. The essence of love or śṛṅgāra-rasa is the cause for other rasa-s. Though these narrations go well while visualizing Her form, Her Absolute form is beyond all these qualities and attributes.* *There is one more interpretation for this nāma. Śṛṅgāra means primary, arara means veil, sampūrṇa means the Brahman. If interpreted this way, then it means that She is in the form of pure Brahman nirguṇa Brahman and also in the form of the Brahman with attributes (māyā form). It is also said that pūrṇagiri pīṭha is referred in this nāma.* *Continues...* 🌹 🌹 🌹 🌹 🌹 #శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama https://t.me/+LmH1GyjNXXlkNDRl http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://www.facebook.com/103080154909766/ https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://chaitanyavijnanam.tumblr.com/ https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
top of page
bottom of page
留言