top of page
Writer's picturePrasad Bharadwaj

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 126 🌹





*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 126 🌹* *✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్* *సేకరణ : ప్రసాద్ భరద్వాజ* *🌻 98. అశ్వఘోషుడు - 1🌻* *యోగసాధన యందు తీవ్ర తపన కలవానిని 'అవకరుడు' అని బోధించెదము. అవకరమనగా వంకరయని అర్థము కాదు. 'అవకరుడన’గా సాధన రూపమున సమస్త మలినములను నిర్మూలించు కొనువాడు. అజ్ఞానమును, అసంగమను అస్త్రముతో ఖండించువాడు. అవకరణకు ప్రకృతి అందమే స్ఫూర్తినందించుచుండును. ప్రకృతి అందమును సృష్టియందు దర్శించగలవాడు సమర్థుడు. అశ్వఘోషుడు అట్లు దర్శించెను.* *అశ్వఘోషుడు రహదారి కూడలిలో నిలబడి చిత్రలేఖనము చేసెడివాడు. అతని చిత్రములన్నియు సమకాలిక మానవులకు స్ఫూర్తి కలిగించుచుండెడివి. స్ఫూర్తి కలవారే స్ఫూర్తినందివ్వగలరు. అందము నారాధించుట వలన అశ్వఘోషున కట్టి స్ఫూర్తి కలిగినది. ఆట, పాట రంగులు ఆనందము కలిగించనిచో ఆ జీవికి స్ఫూర్తినందు అవకాశము తక్కువ. వాని కొఱకు ప్రత్యేకముగ మీరేర్పరచుకొనిన సినిమా థియేటర్లకు మేము కూడ అప్పుడప్పుడు (టిక్కెట్టు కొని) వచ్చుచుందుము. సినిమాలు దర్శించినపుడు, వాని ఆవశ్యకత జాతికి తగుమాత్రమే అనిపించుచుండును.* *సశేషం.....* 🌹 🌹 🌹 🌹 🌹 #మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/maharshiwisdom/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://chaitanyavijnanam.tumblr.com/

Comments


Post: Blog2 Post
bottom of page