top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 222: 05వ అధ్., శ్లో 18 / Bhagavad-Gita - 222: Chap. 05, Ver. 18


🌹. శ్రీమద్భగవద్గీత -222 / Bhagavad-Gita - 222 🌹


✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 18 🌴


18. విద్యావినయసమ్పన్నే బ్రాహ్మణే గవి హస్తిని |

శుని చైవ శ్వపాకే చ పణ్డితా: సమదర్శిన: ||


🌷. తాత్పర్యం :


వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగును, శునకమును, శునకమాంసము తినువానిని(చండాలుని) సమదృష్టితో వీక్షింతురు.


🌷. భాష్యము :


కృష్ణభక్తిభావన యందున్నవాడు జాతి, కుల విచక్షణను చూపడు. సంఘదృష్టిలో బ్రహ్మణుడు మరియు చండాలుడు వేరు కావచ్చును. ఆలాగుననే కుక్క, గోవు, ఏనుగు మొదలుగునవి జాతిదృష్టిలో వేరుకావచ్చును. కాని ఈ విధమైన దేహపరభేదములు జ్ఞానవంతుడైన యోగి దృష్టిలో అర్థరహితములు. పరమాత్మ రూపున శ్రీకృష్ణభగవానుడు వాటన్నింటి యందును నిలిచి వాటితో సంబంధమును కలిగియుండుటే అందులకు కారణము. భగవానుని గూర్చిన అట్టి అవగాహనయే నిజమైన జ్ఞానమై యున్నది.


భగవానుడు ప్రతిజీవిని కూడా మిత్రునిగా భావించు కారణమున దేహములు వివిధవర్ణములు లేదా జాతులు యందున్నను అతడు మాత్రము సమభావము కలిగియుండును. జీవుల స్థితులతో నిమిత్తములేక అతడు సర్వుల యందును పరమాత్మరూపున వసించియుండును. బ్రహ్మణుడు మరియు చండాలుని దేహములు సమానములు కాకున్నను పరమాత్మ రూపున భగవానుడు ఆ రెండింటి యందును నిలిచియుండును. దేహములనునవి ప్రక్రుతిజన్యత్రిగుణముల ద్వారా రూపొందినవైనను, దేహము నందుండెడి ఆత్మా, పరమాత్మ మాత్రము ఒకే ఆధ్యాత్మికతను కలిగియున్నట్టివి.


సమాన ఆధ్యాత్మికతను కలిగియున్నప్పటికిని ఆత్మ, పరమాత్మ పరిమాణరీతిని ఎన్నడును సమానములు కావు. ఏలయన జీవాత్మ తాను నిలిచియున్న దేహమునకే పరిమితము చెందియుండగా, పరమాత్మ ప్రతిజీవి దేహమునందు నిలిచియుండును. కృష్ణభక్తిరసభావితుడు ఈ జ్ఞానమును సంపూర్ణముగా కలిగియుండుటచే నిక్కముగా జ్ఞానవంతుడును మరియు సమదృష్టి కలవాడును అయియుండును. చైతన్యము, సనాతనత్వము, ఆనందమయత్వము అనునవి ఆత్మ, పరమాత్మల ఒకేరీతి లక్షణములు. కాని వాటి నడుమ గల బేధమేమనగా ఆత్మ తాను నిలిచి యున్న దేహపరిధిలో చేతనము కలిగియుండగా, పరమాత్మ సర్వదేహములు జ్ఞానమును కలిగియుండును. అట్టి పరమాత్మ సర్వదేహములందు ఎట్టి విచక్షణలేక నిలిచియుండును.


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 222🌹


✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada

📚 Prasad Bharadwaj


🌴 Chapter 5 - Karma Yoga - 18 🌴


18. vidyā-vinaya-sampanne brāhmaṇe gavi hastini

śuni caiva śva-pāke ca paṇḍitāḥ sama-darśinaḥ



🌷 Translation :


The humble sages, by virtue of true knowledge, see with equal vision a learned and gentle brāhmaṇa, a cow, an elephant, a dog and a dog-eater [outcaste].


🌹 Purport :


A Kṛṣṇa conscious person does not make any distinction between species or castes. The brāhmaṇa and the outcaste may be different from the social point of view, or a dog, a cow and an elephant may be different from the point of view of species, but these differences of body are meaningless from the viewpoint of a learned transcendentalist. This is due to their relationship to the Supreme, for the Supreme Lord, by His plenary portion as Paramātmā, is present in everyone’s heart. Such an understanding of the Supreme is real knowledge.


As far as the bodies are concerned in different castes or different species of life, the Lord is equally kind to everyone because He treats every living being as a friend yet maintains Himself as Paramātmā regardless of the circumstances of the living entities. The Lord as Paramātmā is present both in the outcaste and in the brāhmaṇa, although the body of a brāhmaṇa and that of an outcaste are not the same. The bodies are material productions of different modes of material nature, but the soul and the Supersoul within the body are of the same spiritual quality.


The similarity in the quality of the soul and the Supersoul, however, does not make them equal in quantity, for the individual soul is present only in that particular body whereas the Paramātmā is present in each and every body. A Kṛṣṇa conscious person has full knowledge of this, and therefore he is truly learned and has equal vision. The similar characteristics of the soul and Supersoul are that they are both conscious, eternal and blissful. But the difference is that the individual soul is conscious within the limited jurisdiction of the body whereas the Supersoul is conscious of all bodies. The Supersoul is present in all bodies without distinction.


🌹 🌹 🌹 🌹 🌹



0 views0 comments

Comments


Post: Blog2 Post
bottom of page