top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 318: 08వ అధ్., శ్లో 08 / Bhagavad-Gita - 318: Chap. 08, Ver. 08


🌹. శ్రీమద్భగవద్గీత - 318 / Bhagavad-Gita - 318 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 08 🌴 08. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా | పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచిన్తయన్ || 🌷. తాత్పర్యం : ఓ పార్థా! మనస్సును ఎల్లవేళలా నా స్మరణము నందే నియుక్తము జేసి ఏమాత్రము మార్గము తప్పక నన్నే దేవదేవునిగా ధ్యానము చేసెడివాడు నన్ను తప్పక చేరగలడు. 🌷. భాష్యము : శ్రీకృష్ణభగవానుడు తన స్మరణ ప్రాముఖ్యమును ఈ శ్లోకమున నొక్కి చెప్పుచున్నాడు. అట్టి శ్రీకృష్ణుని స్మరణము హరేకృష్ణమాహామంత్ర జపకీర్తనముల ద్వారా మనుజుని హృదయమునందు జాగృతము చేయబడును. అట్ట్ శ్రీకృష్ణనామము యొక్క శ్రవణ, కీర్తనములందు కర్ణములు, జిహ్వ, మనస్సు సంపూర్ణముగా నియుక్తమగుచున్నందున ఈ ధ్యానము ఆచరణకు అత్యంతసులభమై యున్నది. ఇట్టి ధ్యానము భగవానుని పొందుటకు తోడ్పడగలదు. “పురుషం” అనగా భోక్త యని భావము. జీవులు శ్రీకృష్ణభగవానుని తటస్థశక్తి స్వరూపులైనను భౌతికకల్మషములకు గురియై యున్నారు. వారు తమను తాము భోక్తలుగా తలచినను వాస్తవమునకు దివ్యభోక్తలు కాజాలరు. శ్రీకృష్ణభగవానుడే తన సంపూర్ణాంశములైన నారాయణుడు, వాసుదేవుడు మొదలగు పలురూపములలో పరమ భోక్తయై యున్నాడని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. కనుక భక్తుడైనవాడు హరేకృష్ణమహామంత్ర జపకీర్తనములను చేయుచు తన పూజాధ్యేయమైన భగవానుని నారాయణ, కృష్ణ, రామాది ఏ రూపములలోనైనా నిరంతరము తలచవచ్చును. ఈ విధానము అతనిని పవిత్రుని చేయగలదు. నిరంతర జపకీర్తనముల వలన అతడు అంత్యకాలమున భగవద్ధామమును చేరగలడు. యోగాభ్యాసమునందు అంతరమందున్న పరమాత్మపై ధ్యానము నిలిపినట్లు, హరినామ జపకీర్తనము ద్వారా మనస్సును సదా శ్రీకృష్ణుని యందు నిలుపవలెను. మనస్సు సదా చంచలమై యుండును గనుక దానిని బలవంతముగా శ్రీకృష్ణుని చింతించునట్లు చేయుట అత్యంత అవసరము. భ్రమరమునే సదా తలచుచు కీటకము ప్రస్తుత జన్మముననే భ్రమరముగా మారెడి వృత్తాంతము ఇచ్చట సాధారణముగా ఉదహరింపబడును. అదేవిధముగా మనము శ్రీకృష్ణుని నిరంతరము స్మరించినచో అంత్యమున ఆ దేవదేవుని స్వరూపమును బోలిన స్వరూపమునే పొందగలము. 🌹 🌹 🌹 🌹 🌹 🌹 Bhagavad-Gita as It is - 318 🌹 ✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj 🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 08 🌴 08. abhyāsa-yoga-yuktena cetasā nānya-gāminā paramaṁ puruṣaṁ divyaṁ yāti pārthānucintayan 🌷 Translation : He who meditates on Me as the Supreme Personality of Godhead, his mind constantly engaged in remembering Me, undeviated from the path, he, O Pārtha, is sure to reach Me. 🌹 Purport : In this verse Lord Kṛṣṇa stresses the importance of remembering Him. One’s memory of Kṛṣṇa is revived by chanting the mahā-mantra, Hare Kṛṣṇa. By this practice of chanting and hearing the sound vibration of the Supreme Lord, one’s ear, tongue and mind are engaged. This mystic meditation is very easy to practice, and it helps one attain the Supreme Lord. Puruṣam means enjoyer. Although living entities belong to the marginal energy of the Supreme Lord, they are in material contamination. They think themselves enjoyers, but they are not the supreme enjoyer. Here it is clearly stated that the supreme enjoyer is the Supreme Personality of Godhead in His different manifestations and plenary expansions as Nārāyaṇa, Vāsudeva, etc. The devotee can constantly think of the object of worship, the Supreme Lord, in any of His features – Nārāyaṇa, Kṛṣṇa, Rāma, etc. – by chanting Hare Kṛṣṇa. This practice will purify him, and at the end of his life, due to his constant chanting, he will be transferred to the kingdom of God. Yoga practice is meditation on the Supersoul within; similarly, by chanting Hare Kṛṣṇa one fixes his mind always on the Supreme Lord. The mind is fickle, and therefore it is necessary to engage the mind by force to think of Kṛṣṇa. One example often given is that of the caterpillar that thinks of becoming a butterfly and so is transformed into a butterfly in the same life. Similarly, if we constantly think of Kṛṣṇa, it is certain that at the end of our lives we shall have the same bodily constitution as Kṛṣṇa. 🌹 🌹 🌹 🌹 🌹

Comentários


Post: Blog2 Post
bottom of page