🌹. శ్రీమద్భగవద్గీత - 317 / Bhagavad-Gita - 317 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 07 🌴
07. తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ |
మయ్యర్పితమనోబుద్ధిర్మామేవైష్యస్యసంశయ; ||
🌷. తాత్పర్యం :
కావున ఓ అర్జునా! సర్వకాలముల యందును నీవు నన్నే (శ్రీకృష్ణుని) తలచుచు నీ విధ్యుక్తధర్మమైన యుద్ధము నొనరింపుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందు నిలుపుట ద్వారా నీవు నన్ను నిస్సందేహముగా పొందగలవు.
🌷. భాష్యము :
అర్జునునకు ఒసగబడిన ఈ ఉపదేశము కామ్యకర్మల యందు మునిగియుండెడి సర్వజనులకు అత్యంత ముఖ్యమైనది. విధ్యుక్తధర్మములను లేదా కర్మలను త్యజించుమణి భగవానుడిచ్చట తెలుపుటలేదు. అనగా వాటిని వారు కొనసాగించుచునే హరేకృష్ణమహామంత్ర జప,కీర్తనముల ద్వారా శ్రీకృష్ణుని స్మరించవలెను.
ఈ పద్ధతి మనుజిని భౌతికకల్మషము నుండి ముక్తిని చేసి, మనోబుద్ధులను కృష్ణుని యందు నియుక్తమగునట్లు చేయగలదు. దివ్యమైన శ్రీకృష్ణుని నామమును కీర్తించుట ద్వారా మనుజుడు అసంశయముగా దివ్యలోకమగు కృష్ణధామమును చేరగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 317 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 07 🌴
07. tasmāt sarveṣu kāleṣu mām anusmara yudhya ca
mayy arpita-mano-buddhir mām evaiṣyasy asaṁśayaḥ
🌷 Translation :
Therefore, Arjuna, you should always think of Me in the form of Kṛṣṇa and at the same time carry out your prescribed duty of fighting. With your activities dedicated to Me and your mind and intelligence fixed on Me, you will attain Me without doubt.
🌹 Purport :
This instruction to Arjuna is very important for all men engaged in material activities. The Lord does not say that one should give up his prescribed duties or engagements. One can continue them and at the same time think of Kṛṣṇa by chanting Hare Kṛṣṇa.
This will free one from material contamination and engage the mind and intelligence in Kṛṣṇa. By chanting Kṛṣṇa’s names, one will be transferred to the supreme planet, Kṛṣṇaloka, without a doubt.
🌹 🌹 🌹 🌹 🌹
Comments