top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 224: 05వ అధ్., శ్లో 20 / Bhagavad-Gita - 224: Chap. 05, Ver. 20


🌹. శ్రీమద్భగవద్గీత - 224 / Bhagavad-Gita - 224 🌹


✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 20 🌴


20. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియమ్ |

స్థిరబుద్ధిరసమ్మూడో బ్రహ్మవిద్ బ్రాహ్మణి స్థిత: ||


🌷. తాత్పర్యం :


ప్రియమైనది పొందినప్పుడు ఉప్పొంగక అప్రియమైనది ప్రాప్తించినప్పుడు ఉద్విగ్నత నొందనివాడును, స్థిరబుద్ధిని కలిగనవాడును, మోహపరవశుడు కానివాడును, భగవద్విజ్ఞానమును పూర్ణముగా నెరిగినవాడును అగు మనుజుడు పరబ్రహ్మమునందు స్థితిని కలిగియున్నట్టివాడే యగును.


🌷. భాష్యము :


ఆత్మానుభవమును పొందిన మహాత్ముని లక్షణములు ఇచ్చట పేర్కొనబడినవి. మిథ్యాతాదాత్మ్యముచే దేహమునే ఆత్మగా భావించెడి మోహగ్రస్థుడు కాకపోవుట అతని ప్రథమలక్షణము.


దేహాత్మభావనను కలిగియుండక తానూ శ్రీకృష్ణభగవానుని అంశనని అతడు సంపూర్ణముగా ఎరిగియుండును. కనుకనే దేహమును సంబంధించినదేదైనను లభించినప్పుడు పొంగుట గాని, నష్టపోయినప్పుడు చింతించుట గాని అతడు చేయడు.


మనస్సు యొక్క ఈ స్థిరత్వమే “స్థిరబుద్ధి” అనబడును. కనుక అతడు దేహమును ఆత్మగా భ్రమించుట గాని, దేహమును శాశ్వతమని తలచి ఆత్మను తృణికరించుట గాని చేయడు.


ఇట్టి జ్ఞానము అతనిని బ్రహ్మము, పరమాత్మ, భగవానుడనెడి పరతత్త్వజ్ఞానమును అవగాహన చేసికొనగలిగెడి స్థితికి చేర్చగలడు. తద్ద్వారా ఆ భక్తుడు భగవానునితో అన్ని విధములుగా సమానము కావలెను మిథ్యాయత్నమును త్యజించి తన నిజస్థితి తెలిసికొనగలడు.


ఇదియే వాస్తవమునకు బ్రహ్మానుభవము లేదా ఆత్మానుభావము అనబడును. అట్టి స్థిరమైన భావనయే కృష్ణభక్తిరస భావనము.


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 224 🌹


✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada

📚 Prasad Bharadwaj


🌴 Chapter 5 - Karma Yoga - 20 🌴


20. na prahṛṣyet priyaṁ prāpya nodvijet prāpya cāpriyam

sthira-buddhir asammūḍho brahma-vid brahmaṇi sthitaḥ


🌷 Translation :


A person who neither rejoices upon achieving something pleasant nor laments upon obtaining something unpleasant, who is self-intelligent, who is unbewildered, and who knows the science of God is already situated in transcendence.


🌹 Purport :


The symptoms of the self-realized person are given herein. The first symptom is that he is not illusioned by the false identification of the body with his true self. He knows perfectly well that he is not this body but is the fragmental portion of the Supreme Personality of Godhead.


He is therefore not joyful in achieving something, nor does he lament in losing anything which is related to his body. This steadiness of mind is called sthira-buddhi, or self-intelligence.


He is therefore never bewildered by mistaking the gross body for the soul, nor does he accept the body as permanent and disregard the existence of the soul.


This knowledge elevates him to the station of knowing the complete science of the Absolute Truth, namely Brahman, Paramātmā and Bhagavān. He thus knows his constitutional position perfectly well, without falsely trying to become one with the Supreme in all respects.


This is called Brahman realization, or self-realization. Such steady consciousness is called Kṛṣṇa consciousness.


🌹 🌹 🌹 🌹 🌹

0 views0 comments

コメント


Post: Blog2 Post
bottom of page