top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 250: 06వ అధ్., శ్లో 17 / Bhagavad-Gita - 250: Chap. 06, Ver. 17


🌹. శ్రీమద్భగవద్గీత - 250 / Bhagavad-Gita - 250 🌹


✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 17 🌴


17. యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు |

యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ||


🌷. తాత్పర్యం :


నియమితులైన ఆహారము, నిద్ర, విహారము, కర్మములు గలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను శమింప జేసికొనగలడు.


🌷. భాష్యము :


దేహావసరములైన ఆహారము, నిద్ర, భయము, మైథునములందు అతి యనునది యోగాభ్యాసము నందు పురోభివృద్ధిని ఆటంకపరచును. శ్రీకృష్ణభగవానునికి అర్పింపబడిన ఆహారమును పవిత్రమైన ప్రసాదరూపమున స్వీకరించుట ద్వారా ఆహారవిషయము నియమింపబడగలదు. భగవద్గీత (9.26) ప్రకారము కురగాయలు, పుష్పములు, ఫలములు, ధ్యానము, పాలు మొదలుగునవి శ్రీకృష్ణునకు అర్పింపవచ్చును.


ఈ విధముగా కృష్ణభక్తిభావన యందున్నవాడు మానవుల స్వీకరించుటకు పనికిరాణి ఆహారమును (సత్త్వగుణమునందు లేనటువంటి ఆహారములను) స్వీకరింపకుండుట యందు అప్రయత్నముగానే శిక్షుతుడు లేదా నేర్పరి కాగలడు. కృష్ణభక్తిపరాయణుడు కృష్ణపరకర్మలను చేయుట యందు సదా జాగరూకుడై యుండును. నిద్ర యందు అధికముగా కాలమును వ్యర్థము చేయుట గొప్ప నష్టమే కాగలదు (అవ్యర్థ కాలత్వమ్). అట్టి భక్తుడు భక్తియుతసేవ లేకుండా క్షణకాలము వృథాయగుటయు సహింపలేడు.


కనుకనే అతడు నిద్రకు అతి తక్కువ సమయమును కేటాయించును. ఈ విషయమున అతనికి శ్రీరూపగోస్వామి అత్యంత ఆదర్శనియులై యున్నారు. శ్రీకృష్ణుని దివ్యసేవలో రతులై యుండి ఆయన రోజుకు రెండుగంటలు మాత్రమే నిద్రించెడివారు. కొన్నిమార్లు ఆమాత్రమును ఆయన నిద్రించెడివారు కారు. హరిదాసఠాకూరు తన నిత్యనియమమైన మూడులక్షల హరినామజపము పూర్తికానిదే ప్రసాదమును స్వీకరించుట గాని లేదా క్షణకాలము నిద్రించుట గాని చేసెడివారు కారు.


ఇక కర్మ విషమమున కృష్ణభక్తిపరాయణుడు కృష్ణపరములు కానటువంటి కర్మలేవియును చేయకున్నందున అతని కర్మము సదా నియమింపబడి ఇంద్రియభోగభావనచే కలుషితము కాకుండును. ఇంద్రియభోగమనెడి ప్రశ్నయే లేనందున కృష్ణభక్తిరసభావితునికి భౌతికమైన విశ్రాంతి ఉండదు.


ఈ విధముగా తన కర్మ, వాక్కు, నిద్ర, జాగరణ, ఇతర దేహకర్మలన్నియును నియమితులై యున్నందున కృష్ణభక్తిపరాయణునికి భౌతికక్లేశము లేవియును లేకుండును.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 250 🌹


✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada

📚 Prasad Bharadwaj


🌴 Chapter 6 - Dhyana Yoga - 17 🌴


17. yuktāhāra-vihārasya yukta-ceṣṭasya karmasu

yukta-svapnāvabodhasya yogo bhavati duḥkha-hā


🌷 Translation :


He who is regulated in his habits of eating, sleeping, recreation and work can mitigate all material pains by practicing the yoga system.


🌹 Purport :


Extravagance in the matter of eating, sleeping, defending and mating – which are demands of the body – can block advancement in the practice of yoga. As far as eating is concerned, it can be regulated only when one is practiced to take and accept prasādam, sanctified food. Lord Kṛṣṇa is offered, according to the Bhagavad-gītā (9.26), vegetables, flowers, fruits, grains, milk, etc. In this way, a person in Kṛṣṇa consciousness becomes automatically trained not to accept food not meant for human consumption, or not in the category of goodness.


As far as sleeping is concerned, a Kṛṣṇa conscious person is always alert in the discharge of his duties in Kṛṣṇa consciousness, and therefore any unnecessary time spent sleeping is considered a great loss. Avyartha-kālatvam: a Kṛṣṇa conscious person cannot bear to pass a minute of his life without being engaged in the service of the Lord. Therefore, his sleeping is kept to a minimum. His ideal in this respect is Śrīla Rūpa Gosvāmī, who was always engaged in the service of Kṛṣṇa and who could not sleep more than two hours a day, and sometimes not even that.


Ṭhākura Haridāsa would not even accept prasādam nor even sleep for a moment without finishing his daily routine of chanting with his beads three hundred thousand names. As far as work is concerned, a Kṛṣṇa conscious person does not do anything which is not connected with Kṛṣṇa’s interest, and thus his work is always regulated and is untainted by sense gratification. Since there is no question of sense gratification, there is no material leisure for a person in Kṛṣṇa consciousness. And because he is regulated in all his work, speech, sleep, wakefulness and all other bodily activities, there is no material misery for him.


🌹 🌹 🌹 🌹 🌹

Comentários


Post: Blog2 Post
bottom of page