top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 251: 06వ అధ్., శ్లో 18 / Bhagavad-Gita - 251: Chap. 06, Ver. 18


🌹. శ్రీమద్భగవద్గీత - 251 / Bhagavad-Gita - 251 🌹


✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద


📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 18 🌴


18. యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్టతే |

నిస్పృహ: సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ||


🌷. తాత్పర్యం :


యోగాభ్యాసము ద్వారా యోగి తన మనోకర్మలనన్నింటిని నియమించి, విషయకోరికల రహితమైన ఆధ్యాత్మికస్థితి యందు నిలిచినప్పుడు యోగమునందు స్థిరుడైనట్లుగా చెప్పబడును.


🌷. భాష్యము :


సమస్తమగు విషయకోరికల నుండి (వాటిలో ముఖ్యమైనది మైథునసుఖము) విరమణ పొందియుండుటనెడి విషయము ద్వారా యోగికర్మలను సాధారణజనుల కర్మల నుండి వేరుపరుపవచ్చును. తన మనోకర్మలను చక్కగా నియమించిన సంపూర్ణయోగి ఏ విధమైన విషయకోరికల చేతను కలతకు గురికాడు. శ్రీమద్భాగవతము (9.4.18-20) తెలుపబడినట్లు అట్టి పూర్ణత్వస్థితి కృష్ణభక్తిభావన యందున్నవారిచే అప్రయత్నముగా పొందబడును.


“మహారాజు అంబరీషుడు తన మనస్సును శ్రీకృష్ణుని చరణకమలముల చెంత నియుక్తము చేసెను. అతడు తన పలుకులను ఆ దేవదేవుని దివ్యగుణములను వర్ణించుట యందును, తన హస్తములను శ్రీహరి మందిరములను శుభ్రము చేయుట యందును, తన కర్ణములను అచ్యుతిని కర్మలను శ్రవణము చేయుట యందును, తన చక్షువులను ముకుందుని దివ్యరూపములను వీక్షించు యందును, తన దేహమును భక్తుల దేహములను స్పృశించుట యందును, తన నాసికను శ్రీకృష్ణభాగావానునికిని అర్పింపబడిన కలువపూలను వాసన చూచుట యందును, తన జిహ్వను ఆ భగవానుని చరణకమలములకు అర్పించిన తులసీదళములను రుచిచూచుట యందును, తన పాదములను శ్రీహరి తీర్థస్థలములకు మరియు మందిరములకు పోవుట యందును, తన శిరమును హృషీకేశునికి వందనమొనర్చుట యందును, తన కోరికలను ఉత్తమశ్లోకుడైన శ్రీకృష్ణుని కార్యములను నిర్వహించుట యందును నియోగించును. అతని ఈ దివ్యకార్యములన్నియును శుద్ధభక్తులకు తగినవై యున్నవి.”


నిరాకారమార్గమును అవలంబించువారికి ఇట్టి ఆధ్యాత్మికస్థితి అనిర్వచనీయము, ఊహాతీతమైనను కృష్ణభక్తిభావనలో నున్నవారికి సులభము మరియు ఆచరణీయమై యున్నది. ఈ విషయము పైన వర్ణింపబడిన అంబరీషుని కార్యముల ద్వారా విదితమగుచున్నది. నిత్యస్మరణము ద్వారా శ్రీకృష్ణభగవానుని చరణకమలముల చెంత మనస్సు లగ్నము కానిదే అట్టి ఆధ్యాత్మిక కర్మలు ఆచరణీయములు కాజాలవు.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 251 🌹


✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada

📚 Prasad Bharadwaj


🌴 Chapter 6 - Dhyana Yoga - 18 🌴


18. yadā viniyataṁ cittam ātmany evāvatiṣṭhate

nispṛhaḥ sarva-kāmebhyo yukta ity ucyate tadā



🌷 Translation :


When the yogī, by practice of yoga, disciplines his mental activities and becomes situated in transcendence – devoid of all material desires – he is said to be well established in yoga.


🌹 Purport :


The activities of the yogī are distinguished from those of an ordinary person by his characteristic cessation from all kinds of material desires – of which sex is the chief. A perfect yogī is so well disciplined in the activities of the mind that he can no longer be disturbed by any kind of material desire. This perfectional stage can automatically be attained by persons in Kṛṣṇa consciousness, as stated in the Śrīmad-Bhāgavatam (9.4.18–20):


“King Ambarīṣa first of all engaged his mind on the lotus feet of Lord Kṛṣṇa; then, one after another, he engaged his words in describing the transcendental qualities of the Lord, his hands in mopping the temple of the Lord, his ears in hearing of the activities of the Lord, his eyes in seeing the transcendental forms of the Lord, his body in touching the bodies of the devotees, his sense of smell in smelling the scents of the lotus flowers offered to the Lord, his tongue in tasting the tulasī leaf offered at the lotus feet of the Lord, his legs in going to places of pilgrimage and the temple of the Lord, his head in offering obeisances unto the Lord, and his desires in executing the mission of the Lord. All these transcendental activities are quite befitting a pure devotee.”


🌹 🌹 🌹 🌹 🌹


Comments


Post: Blog2 Post
bottom of page