top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 265: 06వ అధ్., శ్లో 32 / Bhagavad-Gita - 265: Chap. 06, Ver. 32


🌹. శ్రీమద్భగవద్గీత - 265 / Bhagavad-Gita - 265 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 32 🌴


32. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున |

సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మత: ||


🌷. తాత్పర్యం :


ఓ అర్జునా! ఎవడు తనతో పోల్చుకొని సమస్తజీవులకు వాటి సుఖదుఃఖములందు సమముగా గాంచునో అతడే ఉత్తమయోగి యనబడును.


🌷. భాష్యము :


తన స్వానుభవకారణముగా సర్వుల సుఖదుఃఖములను తెలిసియుండెడి కృష్ణభక్తిరసభావితుడు వాస్తవమునకు ఉత్తమయోగి యనబడును. భగవానునితో తనకు గల సంబధమును మరచుటయే జీవుని దుఃఖమునకు కారణమై యున్నది.


కాని శ్రీకృష్ణుడే సర్వమానవకర్మలకు దివ్యభోక్తయనియు, సమస్తజగములకు ప్రభువనియు, సర్వజీవుల ఆప్తమిత్రుడనియు ఎరుగుటయే జీవుని సుఖశాంతులకు కారణము కాగలదు.


ప్రకృతిజన్య త్రిగుణములకు లొంగి యుండెడి జీవుడు తనకు శ్రీకృష్ణునితో గల సంబంధమును మరచుట చేతనే తాపత్రయములకు లోనగునని యోగియైనవాడు ఎరిగియుండును.


కృష్ణభక్తిభావన యందు నిలుచు అట్టి యోగి సుఖియై యుండును కనుక కృష్ణసంబంధ విజ్ఞానమును సర్వులకు పంచుటకు యత్నించును.


ప్రతియొక్కరు కృష్ణభక్తిరసభావితులు కావలసిన అవశ్యకతను అతడు ప్రచారము చేయ యత్నించునందున అతడే నిజముగా జగములో ఉత్తమమైన జహితైషియు మరియు శ్రీకృష్ణునకు ప్రియతమ సేవకుడును కాగలడు. “న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమ:” ( భగవద్గీత 18.69).


అనగా భక్తుడు సదా జీవులందరి క్షేమమును గాంచుట సర్వులకు ఆప్తమిత్రుడు కాగలడు. యోగమునందు పూర్ణత్వమును స్వీయలాభాపేక్ష కొరకు గాక కేవలము ఇతరుల కొరకే ఉపయోగించు కారణమున అతడు ఉత్తమయోగియు కాగలడు.


ఇతర జీవుల యెడ అతడెన్నడును ఈర్ష్యను కలిగియుండడు. విశుద్ధభక్తునికి మరియు స్వీయోద్ధారమునకై యత్నించు సాధారణయోగికి నడుమ వ్యత్యాసము ఇచ్చటనే యున్నది.


కనుకనే చక్కగా ధ్యానము చేయుట కొరకు ఏకాంతస్థలమునకు పోవు యోగి, ప్రతియొక్కరికి తన శక్తి కొలది కృష్ణభక్తిరసభావితులుగా మార్చ యత్నము చేయు భక్తుని కన్నను పూర్ణుడు కానేరడు.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 265 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 6 - Dhyana Yoga - 32 🌴


32. ātmaupamyena sarvatra samaṁ paśyati yo ’rjuna

sukhaṁ vā yadi vā duḥkhaṁ sa yogī paramo mataḥ


🌷 Translation :


He is a perfect yogī who, by comparison to his own self, sees the true equality of all beings, in both their happiness and their distress, O Arjuna!



🌹 Purport :


One who is Kṛṣṇa conscious is a perfect yogī; he is aware of everyone’s happiness and distress by dint of his own personal experience. The cause of the distress of a living entity is forgetfulness of his relationship with God.


And the cause of happiness is knowing Kṛṣṇa to be the supreme enjoyer of all the activities of the human being, the proprietor of all lands and planets, and the sincerest friend of all living entities.


The perfect yogī knows that the living being who is conditioned by the modes of material nature is subjected to the threefold material miseries due to forgetfulness of his relationship with Kṛṣṇa. And because one in Kṛṣṇa consciousness is happy, he tries to distribute the knowledge of Kṛṣṇa everywhere.


Since the perfect yogī tries to broadcast the importance of becoming Kṛṣṇa conscious, he is the best philanthropist in the world, and he is the dearest servitor of the Lord. Na ca tasmān manuṣyeṣu kaścin me priya-kṛttamaḥ (Bg. 18.69).


In other words, a devotee of the Lord always looks to the welfare of all living entities, and in this way he is factually the friend of everyone.


He is the best yogī because he does not desire perfection in yoga for his personal benefit, but tries for others also. He does not envy his fellow living entities. Here is a contrast between a pure devotee of the Lord and a yogī interested only in his personal elevation.


The yogī who has withdrawn to a secluded place in order to meditate perfectly may not be as perfect as a devotee who is trying his best to turn every man toward Kṛṣṇa consciousness.


🌹 🌹 🌹 🌹 🌹

Comments


Post: Blog2 Post
bottom of page