🌹. శ్రీమద్భగవద్గీత - 266 / Bhagavad-Gita - 266 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 33 🌴
33. అర్జున ఉవాచ
యోయం యోగస్త్వయా ప్రోక్త: సామ్యేన మధుసూదన |
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరామ్ ||
🌷. తాత్పర్యం : అర్జునుడు పలికెను : ఓ మధుసుదనా! మనస్సు చంచలమును మరియు అస్థిరమును అయియున్నందున నీవు సంగ్రహముగా తెలిపినటువంటి యోగపద్ధతి ఆచరణకు అసాధ్యమైనదిగను మరియు ఓర్వరానిదిగను నాకు తోచుచున్నది. 🌷. భాష్యము : “శుచౌదేశే” యను పదముతో ఆరంభమై “యోగీపరమ:” యను పదముతో సమాప్తి నొందెడి యోగపద్ధతిని శ్రీకృష్ణుడు అర్జునునకు వివరించగా, దానికి తాను అశక్తుడననెడి భావనలో అతడు ఆ పద్ధతిని ఇచ్చట తిరస్కరించుచున్నాడు. కలియుగములో సాధారణమానవునకు గృహమును విడిచి కొండలలోనో, అడవులలోనో ఏకాంతస్థలమునకు పోయి యోగాభ్యాసము చేయుట సాధ్యము కానటువంటి విషయము. స్వల్పజీవితము కొరకు తీవ్రసంఘర్షణ యనునది ఈ యుగలక్షణమై యున్నది. ఈ కాలమున జనులు ఆత్మానుభూతి విషయమున శ్రద్ధారహితులై యున్నారు. సామాన్యములు మరియు ఆచరణయోగ్యములైన పద్ధతులనే వారు స్వీకరింపలేరన్నచో నియమితజీవనము, ప్రత్యేక ఆసనపద్ధతి, స్థాననిర్దేసము, విషయకర్మల నుండి మనోనిగ్రహము వంటి కఠినకార్యములు గల యోగపద్ధతిని అనుసరింపలేరనెడి విషయమును గూర్చి వేరుగా చెప్పపనిలేదు. పలు అనుకూలపరిస్థితులను కలిగియున్నప్పటికిని క్రియాశీలునిగా అర్జునుడు అట్టి యోగము నాచరించుట తనకు సాధ్యము కాదని భావించెను. రాచవంశమునకు చెందిన అతడు పలుయోగ్యతల దృష్ట్యా అత్యంత ఉన్నతుడై యుండెను. అతడు గొప్ప వీరుడు, దీర్ఘాయువు గలవాడు మరియు అన్నింటికి మించి దేవదేవుడైన శ్రీకృష్ణునికి ప్రియమిత్రుడు. ఐదువేల సంవత్సరములకు పూర్వము అర్జునుడు ప్రస్తుతము మనకున్నటువంటి పరిస్థితుల కన్నను చక్కని అనుకూల పరిస్థితులను కలిగియున్నను ఈ యోగపద్ధతిని తిరస్కరించెను. అతడు యోగమును ఆచరించినట్లుగా మనకెటువంటి చారిత్రికాధారము లభింపదు. కనకనే ఈ యోగపద్ధతి కలియుగమున అసాధ్యమని భావింపబడినది. ఒకవేళ ఏ కొద్దిమందికో (అసాధారణ పురుషులు) సాధ్యపడినను జనసామాన్యమునకు మాత్రము ఇది మిగుల అసాధ్యము. ఐదువేల సంవత్సరముల క్రిందటే దీని విషయమిట్లుండ ఇక నేటి పరిస్థితి యేమిటి? నామమాత్ర యోగశాలల యందు మరియు సంఘములందు ఈ యోగవిధానము అనుకరింప యత్నించువారు తమను తాము కృతార్థులుగా భావించును, నిక్కముగా కాలమును వృథాపరచునట్టివారే యగుచున్నారు. వాంఛితమగు లక్ష్యమును గూర్చిన విషయమున వారు సంపూర్ణముగా అజ్ఞానులై యున్నారు. 🌹 🌹 🌹 🌹 🌹 🌹 Bhagavad-Gita as It is - 266 🌹 ✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj 🌴 Chapter 6 - Dhyana Yoga - 33 🌴 33. arjuna uvāca yo ’yaṁ yogas tvayā proktaḥ sāmyena madhusūdana etasyāhaṁ na paśyāmi cañcalatvāt sthitiṁ sthirām 🌷 Translation : Arjuna said: O Madhusūdana, the system of yoga which You have summarized appears impractical and unendurable to me, for the mind is restless and unsteady. 🌹 Purport : The system of mysticism described by Lord Kṛṣṇa to Arjuna beginning with the words śucau deśe and ending with yogī paramaḥ is here being rejected by Arjuna out of a feeling of inability. It is not possible for an ordinary man to leave home and go to a secluded place in the mountains or jungles to practice yoga in this Age of Kali. The present age is characterized by a bitter struggle for a life of short duration. People are not serious about self-realization even by simple, practical means, and what to speak of this difficult yoga system, which regulates the mode of living, the manner of sitting, selection of place, and detachment of the mind from material engagements. As a practical man, Arjuna thought it was impossible to follow this system of yoga, even though he was favorably endowed in many ways. He belonged to the royal family and was highly elevated in terms of numerous qualities; he was a great warrior, he had great longevity, and, above all, he was the most intimate friend of Lord Kṛṣṇa, the Supreme Personality of Godhead. Five thousand years ago, Arjuna had much better facilities than we do now, yet he refused to accept this system of yoga. In fact, we do not find any record in history of his practicing it at any time. Therefore this system must be considered generally impossible in this Age of Kali. Of course it may be possible for some very few, rare men, but for the people in general it is an impossible proposal. 🌹 🌹 🌹 🌹 🌹
Comments