top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 275: 06వ అధ్., శ్లో 42 / Bhagavad-Gita - 275: Chap. 06, Ver. 42


🌹. శ్రీమద్భగవద్గీత - 275 / Bhagavad-Gita - 275 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 42 🌴


42. అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ |

ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ||


🌷. తాత్పర్యం :


లేదా (దీర్ఘకాల యోగాభ్యాసము పిమ్మటయు కృతకృత్యుడు కానిచో) అతడు జ్ఞానవంతులైన యోగుల ఇంట జన్మము నొందును. కాని ఈ జగములో అట్టి జన్మము నిశ్చయముగా అరుదుగా నుండును.


🌷. భాష్యము :


జీవితారంభము నుండియే శిశువునకు ఆధ్యాత్మిక ప్రోత్సాహము లభించును కనుక జ్ఞానవంతులైన యోగుల ఇంట లేదా భక్తుల ఇంట జన్మము అతిఘనముగా ఇచ్చట కీర్తించబడినది. ఇట్టిది ఆచార్యుల వంశమునందు లేదా గోస్వాములు వంశమునందు ప్రత్యేకమైనదియై యున్నది. అట్టి వంశములవారు సంస్కృతి మరియు శిక్షణ కారణమున జ్ఞానవంతులను, భక్తులును అయియుందురు. తత్కారణమున వారు ఆధ్యాత్మికాచార్యులు కాగలరు. భారతదేశమునందు అట్టి ఆచార్యుల వంశములు పెక్కుయున్నను విద్య మరియు శిక్షణ లోపించియున్నందున అవి ప్రస్తుతము పతనము నొందియున్నవి.


అయినను భగవత్కరుణచే అట్టి వంశములు కొన్ని ఇంకను తరతరములుగా భక్తులను వృద్ధిచేయుచున్నవి. అటువంటి వంశములందు జన్మించుట యనునది నిశ్చయముగా మిక్కిలి అదృష్టకరవిషయము. భగవత్కృప చేతనే నా ఆధ్యాత్మిక గురువైన ఓం విష్ణుపాద శ్రీమద్ భక్తిసిద్ధాంతసరస్వతీ గోస్వాములవారును మరియు నేనును అటువంటి భక్తుల వంశములలో జన్మించుటకు అవకాశమును పొందితిమి. ఆ విధముగా జీవితారంభము నుండియు మేము శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ యందు సుశిక్షితులమై తదుపరి దివ్యమగు భగవత్సంకల్పముచే ఒకరినొకరు కలిసికొంటివి.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 275 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 6 - Dhyana Yoga - 42 🌴


42. atha vā yoginām eva kule bhavati dhīmatām

etad dhi durlabha-taraṁ loke janma yad īdṛśam

🌷 Translation : Or [if unsuccessful after long practice of yoga] he takes his birth in a family of transcendentalists who are surely great in wisdom. Certainly, such a birth is rare in this world. 🌹 Purport : Birth in a family of yogīs or transcendentalists – those with great wisdom – is praised herein because the child born in such a family receives a spiritual impetus from the very beginning of his life. It is especially the case in the ācārya or gosvāmī families. Such families are very learned and devoted by tradition and training, and thus they become spiritual masters. In India there are many such ācārya families, but they have now degenerated due to insufficient education and training. By the grace of the Lord, there are still families that foster transcendentalists generation after generation. It is certainly very fortunate to take birth in such families. Fortunately, both our spiritual master, Oṁ Viṣṇupāda Śrī Śrīmad Bhaktisiddhānta Sarasvatī Gosvāmī Mahārāja, and our humble self had the opportunity to take birth in such families, by the grace of the Lord, and both of us were trained in the devotional service of the Lord from the very beginning of our lives. Later on we met by the order of the transcendental system. 🌹 🌹 🌹 🌹 🌹


Comments


Post: Blog2 Post
bottom of page