top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 290: 07వ అధ్., శ్లో 10 / Bhagavad-Gita - 290: Chap. 07, Ver. 10


🌹. శ్రీమద్భగవద్గీత - 290 / Bhagavad-Gita - 290 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 10 🌴


10. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ |

బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్


🌷. తాత్పర్యం :


ఓ పృథాకుమారా! నేనే సర్వప్రాణులకు సనాతనబీజముననియు, బుద్ధిమంతుల బుద్ధిననియు, శక్తిమంతుల శక్తిననియు తెలిసికొనుము.


🌷. భాష్యము :


బీజమనగా విత్తనము, స్థావర, జంగమాది సమస్తజీవులకు శ్రీకృష్ణుడే బీజమై యున్నాడు. పక్షులు, జంతువులు, మనుజులు, పలు ఇతరజీవులు జంగమములు కాగా, వృక్షాదులు స్థావరములు. స్థావరములు కదలలేక కేవలము స్థిరముగా నిలిచియుండును. ప్రతిజీవియు ఎనుబదినాలుగులక్షల జీవరాసులలో ఏదియో ఒక రకమునకు చెందియుండును. వానిలో కొన్ని స్థావరములై యుండగా, మరికొన్ని జంగములై యున్నవి. అయినను అన్నింటికిని బీజప్రదాత శ్రీకృష్ణుడే. దేని నుండి సమస్తము ఉద్భవించునో అదియే పరబ్రహ్మము లేదా పరతత్త్వమని వేదవాజ్మయమునందు తెలుపబడినది.


శ్రీకృష్ణుడే ఆ పరతత్త్వము మరియు పరబ్రహ్మమును అయి యున్నాడు. బ్రహ్మము నిరాకారము కాగా పరబ్రహ్మము మాత్రము సాకారము. భగవద్గీత యందు తెలుపబడినట్లు నిరాకారబ్రహ్మము పరబ్రహ్మమైన శ్రీకృష్ణుని యందు పతిష్టితమై యున్నది. కనుక శ్రీకృష్ణుడే సర్వమునాకు కారణమును మరియు మూలమును అయి యున్నాడు. వృక్షమూలము వృక్షమునంతటిని పోషించురీతి, సర్వమునకు సనాతనములమై యున్నందున శ్రీకృష్ణుడు జగమునందు సమస్తమును పోషించుచున్నాడు. ఈ విషయము కఠోపనిషత్తు (2.2.13) నందు కూడా నిర్దారింపబడినది.


నిత్యోనిత్యానాం చేతన శ్చేతనానామ్ |

ఏకో బహూనాం యో విదధాతి కామాన్


నిత్యులైనవారిలో ప్రధానమైనవాడు అతడే. సమస్తజీవులలో దివ్యుడు అతడే. అతడొక్కడే సర్వులకు పోషించువాడై యున్నాడు. వాస్తవమునకు బుద్ధి నుపయోగింపక ఎవ్వరును ఏ కార్యమును చేయలేరు. అట్టి బుద్ధికి సైతము కారణము తానేనని శ్రీకృష్ణభగవానుడు పలుకుచున్నాడు. కనుకనే మనుజుడు బుద్ధిమంతుడు కానిదే దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగాహన చేసికొనజాలడు.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 290 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 7 - Jnana Yoga - 10 🌴


10. bījaṁ māṁ sarva-bhūtānāṁ viddhi pārtha sanātanam

buddhir buddhimatām asmi tejas tejasvinām aham


🌷 Translation :


O son of Pṛthā, know that I am the original seed of all existences, the intelligence of the intelligent, and the prowess of all powerful men.


🌹 Purport :


Bījam means seed; Kṛṣṇa is the seed of everything. There are various living entities, movable and inert. Birds, beasts, men and many other living creatures are moving living entities; trees and plants, however, are inert – they cannot move, but only stand. Every entity is contained within the scope of 8,400,000 species of life; some of them are moving and some of them are inert. In all cases, however, the seed of their life is Kṛṣṇa. As stated in Vedic literature, Brahman, or the Supreme Absolute Truth, is that from which everything is emanating. Kṛṣṇa is Para-brahman, the Supreme Spirit.


Brahman is impersonal and Para-brahman is personal. Impersonal Brahman is situated in the personal aspect – that is stated in Bhagavad-gītā. Therefore, originally, Kṛṣṇa is the source of everything. He is the root. As the root of a tree maintains the whole tree, Kṛṣṇa, being the original root of all things, maintains everything in this material manifestation. This is also confirmed in the Vedic literature (Kaṭha Upaniṣad 2.2.13):


nityo nityānāṁ cetanaś cetanānām

eko bahūnāṁ yo vidadhāti kāmān


He is the prime eternal among all eternals. He is the supreme living entity of all living entities, and He alone is maintaining all life. One cannot do anything without intelligence, and Kṛṣṇa also says that He is the root of all intelligence. Unless a person is intelligent he cannot understand the Supreme Personality of Godhead, Kṛṣṇa.


🌹 🌹 🌹 🌹 🌹

Commentaires


Post: Blog2 Post
bottom of page