top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 296: 07వ అధ్., శ్లో 16 / Bhagavad-Gita - 296: Chap. 07, Ver. 16


🌹. శ్రీమద్భగవద్గీత - 296 / Bhagavad-Gita - 296 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 16 🌴


16. చతుర్విధా భజన్తే మాం జనా: సుకృతినోర్జున |

ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ


🌷. తాత్పర్యం :


ఓ భరతవంశ శ్రేష్టుడా! ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, పరతత్త్వజ్ఞానము నన్వేషించువాడు అనెడి నాలుగురకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్తసేవ నొనరింతురు.


🌷. భాష్యము :


దుష్కృతులకు భిన్నముగా శాస్త్రములందు తెలుపబడిన నియమములకు కట్టుబడి వర్తించు ఇట్టివారు “సుకృతిన:” అనబడుదురు. అనగా వారు శాస్త్రములందలి సాంఘిక మరియు నైతికనియమములను పాటించుచు దాదాపు శ్రీకృష్ణభగవానుని యెడ భక్తిని కలిగియుందురు. అటువంటి వారిలో ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసువులు, పరతత్త్వజ్ఞానము కొరకై అన్వేషించువారు అనెడి నాలుగుతరగతుల వారు గలరు. ఇట్టివారు వివిధ పరిస్థితులలో భక్తియుక్తసేవ నొనర్చుటకు భగవానుని దరిచేరుదురు. తాము చేయు భక్తికి కొంత ప్రతిఫలమును కోరియుండుటచే వాస్తవమునకు వారు శుద్ధభక్తులు కారు. శుద్ధభక్తి యనునది ఆశలకు మరియు భౌతికలాభాపేక్షకు అతీతమైనట్టిది. అటువంటి శుద్ధభక్తిని భక్తిరసామృతసింధువు (1.1.11) ఈ విధముగా నిర్వచించినది.


అన్యాభిలాషితాశూన్యం జ్ఞానకర్మాద్యనావృతం |

అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా


“కామ్యకర్మల ద్వారా గాని, తాత్త్వికకల్పనల ద్వారా గాని భౌతికలాభాపేక్ష లేకుండగ అనుకూల్యముగా శ్రీకృష్ణభగవానునికి ప్రతియొక్కరు దివ్యమైన ప్రేమయుక్తసేవ నొనరింపవలసియున్నది. అదియే శుద్ధమైన భక్తియుతసేవ యనబడును.”


ఈ నాలుగుతెగల మనుజులు భక్తియోగమును నిర్వహించుటకై శ్రీకృష్ణభగవానుని దరిచేరినపుడు శుద్ధభక్తుని సాంగత్యములో పరిశుద్ధులై వారును శుద్ధభక్తులు కాగాలరు. కాని దుష్కృతులైన వారి జీవనము స్వార్థపూరితము,క్రమరహితము, ఆధ్యాత్మికగమ్యశూన్యమై యుండుట వలన వారికి భక్తిలో నెలకొనుట అతికష్టము కాగలదు. కాని అదృష్టవశాత్తు ఒకవేళ వారు శుద్ధభక్తుని సాంగత్యమును పొందినచో వారును శుద్ధభక్తులు కాగలరు.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 296 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 7 - Jnana Yoga - 16 🌴


16. catur-vidhā bhajante māṁ janāḥ su-kṛtino ’rjuna

ārto jijñāsur arthārthī jñānī ca bharatarṣabha


🌷 Translation :


O best among the Bhāratas, four kinds of pious men begin to render devotional service unto Me – the distressed, the desirer of wealth, the inquisitive, and he who is searching for knowledge of the Absolute.


🌹 Purport :


Unlike the miscreants, these are adherents of the regulative principles of the scriptures, and they are called su-kṛtinaḥ, or those who obey the rules and regulations of scriptures, the moral and social laws, and are, more or less, devoted to the Supreme Lord. Out of these there are four classes of men – those who are sometimes distressed, those who are in need of money, those who are sometimes inquisitive, and those who are sometimes searching after knowledge of the Absolute Truth. These persons come to the Supreme Lord for devotional service under different conditions. These are not pure devotees, because they have some aspiration to fulfill in exchange for devotional service. Pure devotional service is without aspiration and without desire for material profit. The Bhakti-rasāmṛta-sindhu (1.1.11) defines pure devotion thus:


anyābhilāṣitā-śūnyaṁ jñāna-karmādy-anāvṛtam

ānukūlyena kṛṣṇānu- śīlanaṁ bhaktir uttamā


“One should render transcendental loving service to the Supreme Lord Kṛṣṇa favorably and without desire for material profit or gain through fruitive activities or philosophical speculation. That is called pure devotional service.”


When these four kinds of persons come to the Supreme Lord for devotional service and are completely purified by the association of a pure devotee, they also become pure devotees. As far as the miscreants are concerned, for them devotional service is very difficult because their lives are selfish, irregular and without spiritual goals. But even some of them, by chance, when they come in contact with a pure devotee, also become pure devotees.


🌹 🌹 🌹 🌹 🌹

Comments


Post: Blog2 Post
bottom of page