top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 301: 07వ అధ్., శ్లో 21 / Bhagavad-Gita - 301: Chap. 07, Ver. 21


🌹. శ్రీమద్భగవద్గీత - 301 / Bhagavad-Gita - 301 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 21 🌴


21. యో యో యాం యాం తనుం భక్త: శ్రద్ధయార్చితు మిచ్చతి |

తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ ||


🌷. తాత్పర్యం :


నేను ప్రతివారు హృదయమునందు పరమాత్మరూపున నిలిచియుందును. ఎవరేని ఒక దేవతను పూజింప గోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ దేవతకు అతడు భక్తుడగునట్లు చేయుదును.


🌷. భాష్యము :


భగవానుడు సర్వజీవులకు స్వతంత్రత నొసగియున్నాడు. కనుకనే మనుజుడు విషయభోగమును వాంఛించి దానిని దేవతల నుండి పొందగోరినచో సర్వుల హృదయాంతరవర్తి రూపున ఆ భగవానుడు వారి భావముల నవగాహనము చేసికొని వారు కోరినట్లు చేసికొనుట అవకాశము కల్పించును.


సర్వజీవులకు దివ్యజనకునిగా అతడు వారి స్వాతంత్ర్యముతో జోక్యమును కల్పించుకొనక, వారు తమ కోరికలు తీర్చుకొనుటకు అవకాశమును కల్పించును. సర్వశక్తిసమన్వితుడైన భగవానుడు జీవులకు విషయజగమునందు అనుభవించుటకు అవకాశము నొసగి మాయాశక్తి వలలో తగులుకొనునట్లు ఏల చేయవలెనని కొందరు ప్రశ్నించవచ్చును.


శ్రీకృష్ణభగవానుడు పరమాత్మ రూపున అట్టి అవకాశములు మరియు సౌకర్యములు కల్పించనచో జీవుల స్వాతంత్ర్యమను పదమునకు అర్థమే ఉండదనుట ఆ ప్రశ్నకు సమాధానము. కనుకనే అతడు సర్వజీవులకు సంపూర్ణ స్వాతంత్ర్యమును వారు కోరినది కోరినట్లుగా ఒసగుచున్నాడు.


కాని సర్వధర్మములను విడిచి తననొక్కనినే శరణుపొందవలె ననునది అతని చరమోపదేశము. అది మనకు గీతాజ్ఞానపు అంత్యమున దర్శనమిచ్చును. అట్టి ఉపదేశపాలనము మనుజుని ఆనంధభాగుని చేయగలదు.


జీవులు మరియు దేవతలు ఇరువురును శ్రీకృష్ణభగవానుని ఆధీనమున ఉండువారు. తత్కారణమున జీవుడు తన కోరిక ననుసరించి ఏదేని దేవతను పూజింపజాలడు.


అదేవి ధముగా దేవదేవుని అనుమతి లేనిదే దేవతలు సైతము ఎట్టి వరముల నొసగజాలరు. సాధారణముగా చెప్పబడునట్లు భగవానుని ఆజ్ఞ లేనిదే గడ్డిపోచ కూడా కదలదు. సామాన్యముగా జగమునందు ఆర్తులైనవారు వేదములు ఉపదేశించిన రీతి వివిధ దేవతల దరిచేరుదురు. అనగా ఏదేని వరమును వాంఛించువాడు ఆయా దేవతలను పూజించుచుండును.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 301 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 7 - Jnana Yoga - 21 🌴


21. yo yo yāṁ yāṁ tanuṁ bhaktaḥ śraddhayārcitum icchati

tasya tasyācalāṁ śraddhāṁ tām eva vidadhāmy aham


🌷 Translation :


I am in everyone’s heart as the Supersoul. As soon as one desires to worship some demigod, I make his faith steady so that he can devote himself to that particular deity.


🌹 Purport :


God has given independence to everyone; therefore, if a person desires to have material enjoyment and wants very sincerely to have such facilities from the material demigods, the Supreme Lord, as Supersoul in everyone’s heart, understands and gives facilities to such persons.


As the supreme father of all living entities, He does not interfere with their independence, but gives all facilities so that they can fulfill their material desires.


Some may ask why the all-powerful God gives facilities to the living entities for enjoying this material world and so lets them fall into the trap of the illusory energy.


The answer is that if the Supreme Lord as Supersoul does not give such facilities, then there is no meaning to independence.


Therefore He gives everyone full independence – whatever one likes – but His ultimate instruction we find in the Bhagavad-gītā: one should give up all other engagements and fully surrender unto Him. That will make man happy.


Both the living entity and the demigods are subordinate to the will of the Supreme Personality of Godhead; therefore the living entity cannot worship the demigod by his own desire, nor can the demigod bestow any benediction without the supreme will.


As it is said, not a blade of grass moves without the will of the Supreme Personality of Godhead. Generally, persons who are distressed in the material world go to the demigods, as they are advised in the Vedic literature. A person wanting some particular thing may worship such and such a demigod.


🌹 🌹 🌹 🌹 🌹

Comments


Post: Blog2 Post
bottom of page