🌹. శ్రీమద్భగవద్గీత - 302 / Bhagavad-Gita - 302 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 22 🌴
22. స తయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే |
లభతే చ తత: కామాన్మయైవ విహితాన్ హి తాన్ ||
🌷. తాత్పర్యం :
అట్టి శ్రద్ధను పొందినవాడై మనుజుడు ఏదేని ఒక దేవతారాధనను చేపట్టి తద్ద్వారా తన కోరికలను ఈడేర్చుకొనును. కాని వాస్తవమునకు ఆ వరములన్నియును నా చేతనే ఒసగబడుచున్నవి.
🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుని అనుజ్ఞ లేనిదే దేవతలు తమ భక్తులకు ఎట్టి వరములను ఒసగలేరు. సర్వము శ్రీకృష్ణభగవానునికి చెందినదే యున్న విషయమును జీవులు మరచినను దేవతలు మాత్రము మరువరు.
అనగా దేవతార్చనము మరియు తద్ద్వారా ఇష్టసిద్ధి యనునవి దేవతల వలన గాక ఆ భగవానుని ఏర్పాటు వలననే జరుగుచుండును.
అల్పజ్ఞుడైన జీవుడు ఈ విషయము నెరుగలేడు. కనుకనే మూర్ఖముగా అతడు కొద్దిపాటి లాభమునకై దేవతల నాశ్రయించును. కాని శుద్ధభక్తుడు మాత్రము ఏదేని కావలసివచ్చినప్పుడు ఆ భగవానునే ప్రార్థించును.
అయినను ఆ విధముగా భౌతికలాభమును అర్థించుట శుద్ధభక్తుని లక్షణము కాదు. సాధారణముగా జీవుడు తన కామమును పూర్ణము చేసికొనుట యందు ఆతురతను కలిగియుండును కనుక దేవతల నాశ్రయించును.
జీవుడు తనకు తగనటువంటిదానిని కోరగా భగవానుడు అట్టి కోరికను తీర్చనప్పుడు ఆ విధముగా జరుగుచుండును. ఒకవైపు ఆదిదేవుడైన శ్రీకృష్ణుని అర్చించుచు వేరొక వైపు విషయభోగవాంఛలు కూడియుండుట విరుద్దకోరికలను కలిగియుండుట వంటిదని శ్రీచైతన్యచరితామృతము తెలుపుచున్నది.
కృష్ణునకు ఒనర్చబడు భక్తియుతసేవ మరియు దేవతలకు ఒనర్చబడు పూజ సమస్థాయిలో నున్నటువంటివి కావు. దేవతార్చనము భౌతికము కాగా భగవానుని భక్తియుతసేవ సంపూర్ణముగా దివ్యమగుటయే అందులకు కారణము.
భగవద్ధామమును చేర నభిలషించు జీవునకి విషయకోరికలనునవి అవరోధములు వంటివి. కనుకనే అల్పజ్ఞులగు జీవుల వాంఛించు భౌతికలాభములు శుద్ధభక్తునకు సాధారణముగా ఒసగబడవు.
తత్కారణముననే అట్టి అల్పజ్ఞులు భగవానుని భక్తియుతసేవ యందు నిలుచుటకు బదులు భౌతికజగమునకు చెందిన దేవతల పూజకే ప్రాధాన్యత నొసగుదురు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 302 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 7 - Jnana Yoga - 22 🌴
22. sa tayā śraddhayā yuktas tasyārādhanam īhate
labhate ca tataḥ kāmān mayaiva vihitān hi tān
🌷 Translation :
Endowed with such a faith, he endeavors to worship a particular demigod and obtains his desires. But in actuality these benefits are bestowed by Me alone.
🌹 Purport :
The demigods cannot award benedictions to their devotees without the permission of the Supreme Lord.
The living entity may forget that everything is the property of the Supreme Lord, but the demigods do not forget. So the worship of demigods and achievement of desired results are due not to the demigods but to the Supreme Personality of Godhead, by arrangement.
The less intelligent living entity does not know this, and therefore he foolishly goes to the demigods for some benefit. But the pure devotee, when in need of something, prays only to the Supreme Lord. Asking for material benefit, however, is not a sign of a pure devotee. A living entity goes to the demigods usually because he is mad to fulfill his lust.
This happens when something undue is desired by the living entity and the Lord Himself does not fulfill the desire. In the Caitanya-caritāmṛta it is said that one who worships the Supreme Lord and at the same time desires material enjoyment is contradictory in his desires.
Devotional service to the Supreme Lord and the worship of a demigod cannot be on the same platform, because worship of a demigod is material and devotional service to the Supreme Lord is completely spiritual.
For the living entity who desires to return to Godhead, material desires are impediments. A pure devotee of the Lord is therefore not awarded the material benefits desired by less intelligent living entities, who therefore prefer to worship demigods of the material world rather than engage in the devotional service of the Supreme Lord.
🌹 🌹 🌹 🌹 🌹
Comments