🌹. శ్రీమద్భగవద్గీత - 309 / Bhagavad-Gita - 309 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 29 🌴
29. జరామరణమొక్షాయ మామాశ్రిత్య యతన్తి యే |
తే బ్రహ్మ తద్ విదు: కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలమ్ ||
🌷. తాత్పర్యం :
ముసలితనము మరియు మృత్యువుల నుండి ముక్తిని పొందుటకై యత్నించు బుద్ధిమంతులు భక్తియోగముతో నన్ను ఆశ్రయించుచున్నారు. దివ్యకర్మలను గూర్చి సమగ్రముగా నెరిగి యుండుటచే యథార్థముగా వారు బ్రహ్మస్వరూపులై యున్నారు.
🌷. భాష్యము :
జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులనునవి పాంచభౌతిక దేహమునే ప్రభావితము చేయును గాని ఆధ్యాత్మికదేహమును కాదు.
జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు ఆధ్యాత్మికదేహమునకు లేనందున ఆధ్యాత్మికదేహమును పొందినవాడు భగవానుని పార్షదులలో ఒకడై నిత్యమైన భక్తియుతసేవను చేయుచు వాస్తవముగా ముక్తిని పొందినవాడగును. “అహం బ్రహ్మాస్మి – నేను బ్రహ్మమును” అనగా తానూ వాస్తవమునకు బ్రహ్మస్వరూపుడనని ప్రతియొక్కరు తెలిసికొనవలెను.
ఇట్టి బ్రహ్మభావనము భక్తియందును కలదని ఈ శ్లోకము వివరించుచున్నది. శుద్ధభక్తులైనవారు బ్రహ్మాభావనలో నిత్యముగా నిలిచియుండి దివ్యమైన కర్మలను గూర్చి సమగ్రముగా ఎరిగియుందురు.
శ్రీకృష్ణభగవానుని సేవించు నాలుగుతరగతుల అసంపూర్ణ భక్తులు తమ వాంచితఫలములను పొందుదురు.
అయినను భగవత్కరుణచే వారు కృష్ణభక్తిపూర్ణులైనంతనే శ్రీకృష్ణభగవానునితో నిజముగా ఆధ్యాత్మికసాహచర్యము ననుభవింతురు. కాని దేవతలను పూజించువారు దివ్యధామము నందలి భగవానుని ఎన్నడును చేరలేరు. వారేగాక అల్పజ్ఞులైన బ్రహ్మానుభూతిని బడసినవారు కూడా శ్రీకృష్ణుని దివ్యధామమైన గోలోకబృందావనమును చేరలేరు.
వాస్తవముగా కృష్ణలోకమును చేర యత్నించుచున్నందున కృష్ణభక్తిరసభావన యందు కర్మల నొనరించువారే (మామాశ్రిత్య) “బ్రహ్మము”గా పిలువబడుటకు అర్హులై యున్నారు. అట్టివారికి కృష్ణని యెడ ఎట్టి అపోహలు గాని, సందేహములు గాని లేనందున యథార్థముగా బ్రహ్మస్వరూపులై యున్నారు.
శ్రీకృష్ణభగవానుని శ్రీవిగ్రహారాధన యందు నియుక్తులైనవారు మరియు భవబంధము నుండి ముక్తికొరకే ఆ భగవానుని ధ్యానమునందు నిలిచియుండెడివారు సైతము రాబోవు అధ్యాయములో తెలుపబడినట్లు బ్రహ్మము, ఆధిభూతములాది విషయముల భావముల నెరుగగలరు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 309 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 7 - Jnana Yoga - 29 🌴
29. jarā-maraṇa-mokṣāya mām āśritya yatanti ye
te brahma tad viduḥ kṛtsnam adhyātmaṁ karma cākhilam
🌷 Translation :
Intelligent persons who are endeavoring for liberation from old age and death take refuge in Me in devotional service. They are actually Brahman because they entirely know everything about transcendental activities.
🌹 Purport :
Birth, death, old age and diseases affect this material body, but not the spiritual body. There is no birth, death, old age and disease for the spiritual body, so one who attains a spiritual body, becomes one of the associates of the Supreme Personality of Godhead and engages in eternal devotional service is really liberated. Ahaṁ brahmāsmi: I am spirit. It is said that one should understand that he is Brahman, spirit soul. This Brahman conception of life is also in devotional service, as described in this verse. The pure devotees are transcendentally situated on the Brahman platform, and they know everything about transcendental activities.
Four kinds of impure devotees who engage themselves in the transcendental service of the Lord achieve their respective goals, and by the grace of the Supreme Lord, when they are fully Kṛṣṇa conscious, they actually enjoy spiritual association with the Supreme Lord. But those who are worshipers of demigods never reach the Supreme Lord in His supreme planet. Even the less intelligent Brahman-realized persons cannot reach the supreme planet of Kṛṣṇa known as Goloka Vṛndāvana. Only persons who perform activities in Kṛṣṇa consciousness (mām āśritya) are actually entitled to be called Brahman, because they are actually endeavoring to reach the Kṛṣṇa planet. Such persons have no misgivings about Kṛṣṇa, and thus they are factually Brahman.
Those who are engaged in worshiping the form or arcā of the Lord, or who are engaged in meditation on the Lord simply for liberation from material bondage, also know, by the grace of the Lord, the purports of Brahman, adhibhūta, etc., as explained by the Lord in the next chapter.
🌹 🌹 🌹 🌹 🌹
Comments