🌹. శ్రీమద్భగవద్గీత - 312 / Bhagavad-Gita - 312 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 02 🌴
02. అధియజ్ఞ: కథం కోత్ర దేహేస్మిన్మధుసూదన |
ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభి: ||
🌷. తాత్పర్యం :
ఓ మధుసుదనా! యజ్ఞప్రభువెవ్వరు? అతడు ఏ విధముగా దేహమునందు వసించియుండును? భక్తియోగమునందు నిలిచినవారు మరణసమయమున నిన్నెట్లు ఎరుగజాలుదురు?
🌷. భాష్యము :
యజ్ఞప్రభువను పదము ఇంద్రుని గాని, విష్ణువు గాని సూచించును. విష్ణువు బ్రహ్మరుద్రాది ప్రధానదేవతలతో ముఖ్యుడు కాగా, ఇంద్రుడు కార్యనిర్వాహక దేవతలతో ముఖ్యుడు.
కనుకనే విష్ణువు మరియు ఇంద్రుడు ఇరువురును యజ్ఞములచే అర్పింపబడుదురు. కాని ఎవరు వాస్తవముగా యజ్ఞములకు ప్రభువనియు మరియు ఏ విధముగా భగవానుడు జీవిదేహములో వశించియుండుననియు అర్జునుడు ప్రశ్నించుచున్నాడు.
శ్రీకృష్ణుడు మధువనెడి దానవుని సంహరించి యున్నందున అర్జునుడు అతనిని ఇచ్చట మధుసూదన అని సంభోదించుచున్నాడు. అర్జునుడు కృష్ణభక్తి పరాయణుడైనందున వాస్తవమునకు అతని మనస్సు నందు ఇట్టి సంశయములు ఉదయించకూడదు.
అనగా ఈ సంశయములు దానవులను బోలియున్నవి. దానవులు దునుమాడుటులలో శ్రీకృష్ణుడు నేర్పరి కనుక తన మనస్సులో ఉదయించుచున్న దానవస్వభావ సంశయములను అతడు నశింపజేయునని భావించి అర్జునుడు ఆ దేవదేవుని మధుసూదన యని సంబోధించుచున్నాడు. జీవితమున చేసినదంతయు మరణసమయమున పరీక్షింపబడుచున్నందున “ప్రయాణకాలే” యను పదము ఈ శ్లోకమున ప్రధానమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 312 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 02 🌴
02. adhiyajñaḥ kathaṁ ko ’tra dehe ’smin madhusūdana
prayāṇa-kāle ca kathaṁ jñeyo ’si niyatātmabhiḥ
🌷 Translation :
Who is the Lord of sacrifice, and how does He live in the body, O Madhusūdana? And how can those engaged in devotional service know You at the time of death?
🌹 Purport :
“Lord of sacrifice” may refer to either Indra or Viṣṇu. Viṣṇu is the chief of the primal demigods, including Brahmā and Śiva, and Indra is the chief of the administrative demigods. Both Indra and Viṣṇu are worshiped by yajña performances. But here Arjuna asks who is actually the Lord of yajña (sacrifice) and how the Lord is residing within the body of the living entity.
Arjuna addresses the Lord as Madhusūdana because Kṛṣṇa once killed a demon named Madhu. Actually these questions, which are of the nature of doubts, should not have arisen in the mind of Arjuna, because Arjuna is a Kṛṣṇa conscious devotee. Therefore these doubts are like demons. Since Kṛṣṇa is so expert in killing demons, Arjuna here addresses Him as Madhusūdana so that Kṛṣṇa might kill the demonic doubts that arise in Arjuna’s mind.
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios