🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 101 / Agni Maha Purana - 101 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 33
🌻. పవిత్రారోపణ విధి - శ్రీధర నిత్యపూజా విధానము -2🌻
ఈ విధముగ ప్రార్థించు పవిత్రకమును ఇష్టదేవతామండలమునకు గాయత్రీ మంత్రముతో కట్టవలెను.
''ఓం నమో నారాయణాయ విద్మహే, వాసుదేవాయ దీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్''
అనునది ఇష్టదేవత యగు నారాయణుని గాయత్రీమంత్రము. ఈ గాయత్రీ ఇష్టదేవతానామానుసారముగ ఉండును. దేవప్రతిమలపై అర్పించుటకు అనేక విధములగు పవిత్రకము లుండును. విగ్రహము యొక్క నాభి వరకు వచ్చునది ఒకటి; తొడలవరకు వచ్చునది మరి యొకటి మోకాళ్ళవరకు వచ్చునది మరియొకటి. పాదములవరకు వ్రేలాడునది ఒకటి. చివరిదానికి వనమాల అని పేరు. దానిని ఒక వెయ్యి ఎనిమిది దారములతో నిర్మింపవలెను. సాధారణమాలను శక్త్యనుసారము నిర్మింపవలెను. లేదా అది పదునారు అంగుళములకంటె రెట్టింపు పెద్దదిగా ఉండవలెను. కర్ణికా-కేసర-దళాదులుగల యంత్ర-చక్రదిమండలములపై వేయు పవిత్రకము పైనుండి క్రిందివరకును కప్పునదిగా ఉండవలెను. ఒక చక్రము, ఒక కమలము ఉన్న మంక్షలముపై ఆ మండలము ఎన్ని అంగుళము లున్నదో అన్ని అంగుళముల పవిత్రకము అర్పింపవలెను. వేదిపై అర్పించు పవిత్రకము తన చేతి అంగుళములతో ముప్పదియేడు అంగుళముల పొడ వుండవలెను. ఆచార్యుని కొరకును, తలిదండ్రుల కొరకును, పుస్తకముపై ఉంచుట కొరకును నిర్మింపబుడు పవిత్రకము నాభిప్రదేశము వరకును వ్రేలాడవలెను. దీనికి పండ్రెండు ముడులు ఉండవలెను. దానిపై మంచి గంధము పూయవలెను. వనమాలయందు రెండేసి అంగుళముల దూరమున క్రమముగా నూటఎనిమిది ముడులు వేయవలెను. లేదా కనిష్ఠ-మధ్యదు-ఉత్తమపత్రకములపై క్రమముగా పండ్రెండు, ఇరువదినాలుగు, ముప్పదియారుముడులు వేయవలెను. మంద-మధ్యమ-ఉత్తమమాలార్థు లగ పురుషులు అనామికా-మధ్యమా-అంగుష్ఠములచేతనే పవిత్రకములను గ్రహింపవలెను. లేదా కనిష్ఠకాది నామధేయములు గల పవిత్రకములందు అన్నింటియందును పండ్రెండేసి ముడులే ఉండవలెను. (తంతువుల సంఖ్యను పట్టియు, పొడవును పట్టియు ఈ కనిష్ఠికాదినామదేయము లేర్పడినవి). సూర్యునకు, కలశమునకు, అగ్ని మొదలగు వాటికిని గూడ యథాసంభవముగ భగవంతు డగు విష్ణువునకు వలెనే పవిత్రకములను అర్పించుట ఉత్తమ మని చెప్పబడినది. పీఠముకొరకు దాని పొడవును పట్టియు, కుండమునకు దాని మేఖలపర్యంతమును పొడవు గల పవిత్రకముండవలెను. విష్ణుపార్షదులకు యథాశక్తిగ సూత్రగ్రంథులను సమర్పింపవలెను. లేదా గ్రంథులు లేకుండ పదునేడు సూత్రములు సమర్పింపవలెను. భద్రుడను పార్షదునకు త్రిసూత్రము సమర్పింపవలెను. సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 🌹 Agni Maha Purana - 101 🌹 ✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj Chapter 33 🌻 Mode of investiture of the sacred thread for the deity and the installation of the deity - 2 🌻 8-10. Having prayed (in this way), one has to tie it to the circular altar at first with the Gāyatrī[1] Oṃ nārāyaṇāya vidmahe vāsudevāya dhīmahi tanno viṣṇuḥ pracodayāt. A garland made of one thousand and eight wood-flowers is consecrated to the Lord of lords extending upto the feet and the pavitraka (sacred thread) upto the knees, thighs, and navel of the idol befitting him. The garland should be made thirty-two fingers length. 11. In the circular lotus of one finger (breadth) the pericarp, filament, leaf, the first basic syllable and the outer circumference of the circle are consecrated. 12-13. By the measure of one’s fingers the threads for the preceptors (are consecrated) on the models of the parents on the ground. Twelve knots made fragrant are consecrated to the end of the navel. Then two garlands are made ready at first containing one hundred and eight flowers. 14. O twice born one! Otherwise twenty-four or thirty-six garlands should be consecrated to the sun with the ring and middle fingers by those who desire for a daughter. 15. There may be twelve knots in the sacred thread for the pot of the Sun, and the fire as in the case of Viṣṇu. 16. According to one’s ability the knots of the sacred thread should be placed in the midst of the articles for the worship of Viṣṇu on the altar in the pit encircled by a girdle. 17-18. One who has bathed and performed the twilight worship should dye the seventeen strings divided into three parts, with rocanā (yellow pigment), agallochuṃ, camphor, turmeric, saffron or sandal. Then one has to worship Hari on the eleventh lunar day at the sacrificial yard. Continues.... 🌹 🌹 🌹 🌹 🌹
Comments