top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 102 / Agni Maha Purana - 102


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 102 / Agni Maha Purana - 102 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 33



🌻. పవిత్రారోపణ విధి - శ్రీధర నిత్యపూజా విధానము -3🌻


పవిత్రమును గోరోచనముతోను, అగురుకర్పూరములు కలిపిన పసుపుతోను, కుంకుమరంగుతోను పూయవలెను. భక్తుడు ఏకాదశీదివసమున స్నానసంధ్యాదులు చేసి, పూజగృహము వ్రవేవించి, భగవంతుడగు శ్రీహరిని పూజింపవలెను. విష్ణువుయొక్క సమస్త పరివారమునకును బలి సమర్పించి విష్ణువును పూజింపవలెను.


ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః.


ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.


ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.


ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః''.



ద్వారము యొక్క అంతము నందు ''క్షం క్షేత్రపాలాయ నమః'' అని చెప్పి క్షేత్రపాలపూజ చేయవలెను. ద్వారము పై భాగమున ''శ్రియై నమః'' అని చెప్పుచు శ్రీదేవిని పూజించవలెను.


ద్వారదక్షిణ (కుడి) దేశమున ''ధాత్రే నమః'' ''గంగాయై నమః'' అను మంత్రము లుచ్చరించుచు, ధాతను, గంగను పూజింపవలెను. ఎడమ వైపున ''విధాత్రే నమః'' ''యమునాయై నమః'' అని చెప్పుచు విధాతను, యమునను, పూజింపవలెను. ఇదే విధముగ ద్వారముయొక్క కుడి-ఎడమ ప్రదేశములందు క్రమముగ ''శఙ్ఖనిధయే నమః'' పద్మనిధయే నమః''అని చెప్పుచు శంఖపద్మనిధులను పూజింపవలెను. [పిదప మండపములోపల కుడి హిదము మణవను మూడు మార్లు కొట్టి విఘ్నములను పారద్రోలవలెను].


పిమ్మట ''సారఙ్గాయ నమః అని అనుచు విఘ్నకారములగు భూతములను పారద్రోలవలెను. [పిమ్మట ''ఓం హాం వాస్త్వదిపతయే బ్రహ్మణ నమః'' అను మంత్రము నుచ్చరించుచు బ్రహ్మ యొక్క స్థానమున పుష్పము లుంచవలెను]. పిదప ఆసనముపై కూర్చుండి భూతశుద్ధి చేయవలెను.


''ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం గన్దతన్మాత్రం సంహరామి నమః.


ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః.


ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.


ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.


ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.''


అను ఐదు ఉద్ఘాతవాక్యముల నుచ్చరించుచు గంధతన్మాత్రస్వరూప మగు భూమండలమును, వజ్రచిహ్నితము, సూవర్ణమయము, చతురస్రము (నలుపలకలు గలది) పీఠమును, ఇంద్రాదిదేవతలను తన పాదముల మధ్య నున్నట్లు చూచుచు వాటి భావన చేయవలెను.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 102 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 33


🌻 Mode of investiture of the sacred thread for the deity and the installation of the deity - 3 🌻


19. One has to offer food to all the subordinate deities at the altar. Kṣaum, to the guardian deity at the end of the door. And (one should then worship) Śrī on the garland.


20. (Adorations) to Dhātā, Vidhātā (names of Brahmā), (the rivers) Ganges, Yamunā. And after having worshipped the two nidhis[2] śaṅkha and padma at the middle, the vāstu[3] is removed. (Adorations) to śārṅga (the bow of Viṣṇu). Then one has to perform the purificatory rites for the elements remaining standing.


Oṃ, hrūm, haḥ, phaṭ, hrūṃ, I absorb the subtle principle of smell. Salutations.


Oṃ, hrūṃ, haḥ, phaṭ, hrūṃ. I absorb the subtle principle of taste. Salutations.


Oṃ, hrūṃ, haḥ, phaṭ, hrūṃ I absorb the subtle principle of touch. Salutations.


Oṃ, hrūṃ, haḥ, phaṭ, hrūṃ I absorb the subtle principle of sound. Salutations.



21-22. With the five incantations (as above) one has to meditate on the yellow-coloured, hard quadrangle of earth of the form of subtle principle of smell and governed by Indra with the mark of holding the thunder-bolt in between his feet. Then the worshipper has to spread the pure subtle principle of taste and absorb the subtle principles of taste and colour in this way.



Oṃ, hrīṃ, haḥ, phaṭ, hrūṃ, I absorb the subtle principle of taste. Salutations.


Oṃ, hrīṃ, haḥ, phaṭ, hrūṃ, I absorb the subtle principle of colour. Salutations.


Oṃ, hrīṃ, haḥ, phaṭ, hrūṃ, I.absorb the subtle principle of touch. Salutations.


Oṃ, hrīṃ, haḥ, phaṭ, hrīṃ I absorb the subtle principle of sound. Salutations.



23. One has to meditate on the presiding deity Varuṇa placed in between the two thighs, holding a white lotus jar, white-hued and crescent-shaped.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹

Commenti


Post: Blog2 Post
bottom of page