top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 106 / Agni Maha Purana - 106


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 106 / Agni Maha Purana - 106 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 33


🌻. పవిత్రారోపణ విధి - శ్రీధర నిత్యపూజా విధానము - 7🌻


వాటి వెలుపల తూర్పు మొదలగు దిక్కులందు క్రమముగ ఇంద్ర - అగ్ని-యమ-నిర్బతి- వరుణ-వాయు-కుబేర-ఈశానులను పూజించి నైరృతి పశ్చమదిక్కల మధ్య అనంతుని, తూర్పు-ఈశాన్యదిక్కుల మధ్య బ్రహ్మను పూజించవలెను.


వీటి బైట వజ్రము మొదలగు అస్త్రమయఆవరణములను పూజించవలెను. వీటి బైట దిక్పలకుల వాహనరూపములగు ఆవరణములను పూజింపవలెను. తూర్పు మొదలగు దిక్కులందు క్రమముగ ఐరావతమును, మేకను, దున్నపోతును, వానరుని, మత్స్యమును, మృగమును, చెవులపిల్లిని, వృషభమును, కూర్మమును, హంసను పూజింపవలెను. వీటి బయట పృశ్నిగర్భుడు, కుముదుడు మొదలగు ద్వారపాలులను పూజింపలెను.


తూర్పు మొదలు ఉత్తరము వరకు, అన్ని దిక్కులందును ఇద్దరిద్దరు ద్వారపాంకులను పూజింపవలెను. పిమ్మట శ్రీహరికి నమస్కారము చేసి వెలుపల బలి అర్పింపవలెను. ''ఓం విష్ణుపార్షదేభ్యో నమః '' అను మంత్రము నుచ్చరించుచు విష్ణుపీఠముపై వారలకు బలి అర్పింపవలెను. ఈశానదిక్కునందు ''ఓం విశ్వాయ విష్వక్సేనాయ నమః'' అను మంత్రముచే విష్వక్సేనపూజ చేయవలెను. పిమ్మట దేవుని కుడిచేతికి రక్షాసూత్రము కట్టవలెను.


ఆ సమయమున ఆ భగవంతునితో ఇట్లు చెప్పవలెను-


''దేవా! ఒక సంత్సరముపాటు నిరంతరము జరుగు మీ పూజయొక్క సంపూర్ణఫలము లభించుటకై జరుప నున్న పవిత్రారోపణకర్మకొరకై ఈ కౌతుకసూత్రమును ధరింపుము. ఓం నమః''. పిమ్మట భగవంతుని సమీపమున ఉపవాసాది నియమములను అవలంబించి ఇట్లు చెప్పవలెను. ''నేను నియమపూర్వకముగ ఉపవాసాదులు చేసి ఇష్టదేవతకు సంతోషము కలిగింపగలను. దేవేశ్వరా! నేడు మొదలు వైశేషిక ఉత్సవ దివసము వరకును కామక్రోధాదిదోషము లేవియు నా వద్దకు రాకుండు గాక''.


వ్రతమును స్వీకరించిన యజమానుడు ఉపవాసముచేయు సామర్థ్యము లేని పక్షమున నక్తవ్రతము (రాత్రిమాత్రమే భోజనము చేయుట) ఆచరించవలెను. హవనము చేసి భగవంతునిస్తోత్రము చేసిన పిమ్మట భగవంతుని ఉద్వాసన చెప్పవలెను. భగవంతుని నిత్యపూజ చేసి చో లక్ష్మి ప్రాప్తించును. భగవంతుని పూజించుటకై ''ఓం హ్రీం శ్రీం శ్రీధరాయ త్రైలోక్యమోహనాయ నమః'' అనునది మంత్రము.


శ్రీ అగ్ని మహాపురాణమునందు పవిత్రారోపణమున శ్రీధరనిత్యపూజావిధాన మను ముప్పదిమూడవ అధ్యాయము సమాప్తము.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 106 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 33


🌻 Mode of investiture of the sacred thread for the deity and the installation of the deity - 7 🌻


45. The bow, club, sword, and garland of wild flowers (should be worshipped) outside it. Indra and others as well as Ananta, and Varuṇa (should be worshipped) in the south-west.


46-48. Brahmā and Indra (should be worshipped) in the north-east and their hosts of weapons on the outside. The Airā-vata (the elephant of Indra), goat, buffalo, monkey, fish, deer, hare, bull, tortoise, and haṃsa (should be worshipped) and Kṛṣṇa on the outside. The gate-keepers Kumuda and others (should be worshipped) in pairs from the east to the north. After saluting Hari, the food (is offered) outside. Salutations to the attendants of Viṣṇu. The offering should be made on the altar.


49. One should worship the Universal Being, the All-pervading on the north-east. The protective thread should be tied on the right arm of the lord.


50. (One should say), “Oṃ salutations to the one who confers full benefits of worship done through the whole year. You wear this thread for the purpose of installation.”


51. One should observe the vow of fasting etc. in the presence of the deity (saying), “I am pleasing the deity by observing fasting etc.”


52. “May not lust, anger, and all other (qualities) reside in me ever. O lord of gods from this day onwards it is the last of them.”


53. If the worshipper is unable (to do as described), he should observe the vow eating only in the night. Having made oblations, the visarjana (dismissal) is done, after laudation. This is the (mode of) daily worship which yields riches. Oṃ, hrīṃ, śrīm, salutations to Śrīdhara the enchanter of the three worlds.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹

Comments


Post: Blog2 Post
bottom of page