🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 107 / Agni Maha Purana - 107 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 34
🌻. హోమ విధి - అగ్ని కార్య కథనము - 1🌻
అగ్నిదేవుడు పలికెను :
సాధకుడు ఈ ''ఓం హ్రీం శ్రీం శ్రీధరాయ త్రైలోక్యమోహనాయ నమః'' అను మంత్రము చదువుచు యాగమండపమును ప్రవేశింపవలెను. యజ్ఞశాలను అలంకరింపవలెను. (ఈ క్రింది శ్లోకమును చదువుచు భగవంతునకు నమస్కారము చేయవలెను). ''వేదములకును బ్రాహ్మణులకును హితమును చేయు, అవ్యయ స్వరూపు డగు శ్రీధరునకు నమస్కారము. బుగ్యజుః సామాథర్వవేదములు విష్ణుస్వరూప మైనవి. శబ్దము లన్నియు విష్ణుస్వరూపమే.
అట్టి, భగవంతు డైన విస్ణువునకు నమస్కారము'' సాయంకాలమున సర్వతోభద్రము మొదలగు మండలముల రచన చేసి పూజాద్యుపయుక్తము లగు ద్రవ్యములను సమకూర్చుకొనవలెను. కాళ్లు చేతులు కడుగుకొనవలెను. ఆ యా ద్రవ్యములను తగు స్థానము లందుంచి, చేతితో అర్ఘ్యము గ్రహించి, ఆ జలముతో తన శిరముపై ప్రోక్షించుకొనవలెను. ద్వారాదిప్రదేశములందు నీళ్లు చల్లవలెను. ద్వారయాగ (ద్వారస్థ ) దేవతా పూజా ప్రారంభము చేయవలెను.
మొదటతోరణాధిపతులను బాగుగా పూజింపవలెను. తూర్పు మొదలగు దిక్కులలో అశ్వత్థ-ఉదుమ్బర-వట-ప్లక్ష వృక్షములను పూజింపవలెను. ఇవి కాక, తూర్పున బుగ్వేదమును, ఇంద్రుని, శోభనుని, దక్షిణమున యజుర్వేదమును, యముని, సుభద్రుని పశ్చిమమున సామవేదమును, వరుణుని సుదన్వుని, ఉత్తరమున అథర్వవేదమును, సోముని, సుహోత్రుని పూజింపవలెను.
తోరనము (ద్వారము) లోపల పతాకలు కట్టి రెండేసి కలశములను స్థాపింపవలెను. కుముదము మొదలగు దిగ్గజములను పూజింపవలెను. ఒక్కొక్క గుమ్మమువద్దను ఇద్ద రిద్దరు ద్వారపాలకును, వారి నామమంత్రములు చదువుచు పూజింపవలెను. తూర్పున పూర్ణ-పుష్కరులు, దక్షిణమున అనంద-నందనులు, పశ్చిమమున వీరసేన- సుషేణులు, ఉత్తరమున సంభవ-ప్రభవులు అను ద్వారపాలులను పూజింపవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 107 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 34
🌻 Mode of performing oblation - 1 🌻
Agni said:
1-2. One has to enter the sacrificial ground with the following mystic syllable and adorn it. “Salutations to the brahman, the lord, Śrīdhara (and) undecaying self, the form of Ṛg, Yajur and Sāma (veda), (possessing) a body (composed) of sound (and) Viṣṇu. Having drawn the circular altar in the evening, one has to bring materials for the sacrifice.
3. Having washed hands and feet and made assignment, and taken the arghya (respectful offering) in the hands one should sprinkle the arghya on the head and the gate-way.
4. He should then begin sacrifice at the gateway. He should worship the presiding deity of the arch. The aśvattha[1], udumbara[2], vaṭa[3] and plakṣa[4] are the trees of the east.
5. The Ṛg (veda) is the ornament of Indra on the west. The Yajur (veda) is auspicious for Yama. The Sāma (veda) is of the water-god and is known as Sudhanvan. The Atharva (veda) is of Soma (and is called) Suhotraka.
6. The edges of the gate, flags, (gate-keepers) Kumuda etc. and two pitchers should be adored at every door by their respective names, as well as a pitcher full of water in the east.
7. Then one should worship the guards of the doors—Ānanda, Nandana, Dakṣa, Vīrasena, Suṣeṇaka, Sambhava and Prabhava in the north (Saumya)[5].
8. One should enter after having removed obstacles by throwing flowers and the repetition of names of weapons. Having performed purificatory rites of the elements and the assignment (of limbs) one should show the posture of hands.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments