🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 118 / Agni Maha Purana - 118 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 38
🌻. దేవాలయ నిర్మాణ ఫలము - 1🌻
అగ్నిదేవుడు చెప్పెను:- మునీశ్వరా! వాసుదేవాదుల కొరకు దేవాలయమును చేయించుటకే కలుగు ఫలమును చెప్పుచున్నాను. దేవాలయములు కట్టవలె ననియు. తటాకాదులు నిర్మింపవలె ననియుకలిగిన శుభసంకల్పము అట్టి సంకల్పము కలవాని వేల కొలది జన్మ పాపములను నశింపచేయును. భావన చేతనైన దేవాలయ నిర్మాణము చేసిన వాని అనేక జన్మల పాపములు తొలగిపోవును. ఎవరైన దేవమందిరాదులు గట్టుచున్నప్పుడు దానిని ఆమోదించినవారు కూడ సమస్తపాపములు తొలగి విష్ణులోకమును పొందుదురు.
శ్రీమహావిష్ణువునకు ఆలయము నిర్మించిన వారు భూతకాలమునందలి వేయి తరములవారిని భవిష్యత్తులోని వేయి తరములవారిని విష్ణులోక నివాసార్హులనుగ చేయును. శ్రీకృష్ణుని ఆలయమును నిర్మించినవాని పితరులు వెంటనే నరకదుఃఖమునుండి విముక్తులై. దివ్యవస్త్రాభరణాదులు ధరించి ఆనందముతో విష్ణులోకమున నివసింతురు.
దేవాలయ నిర్మాణము బ్రహ్మహత్యాది పాములను తొలగించును. యజ్ఞము చేయుట వలన కలుగని ఫలములు గూడ దేవాలయ నిర్మాణముచే కలుగును. దేవాలయ నిర్మాణము వలన సమస్త తీర్థములందును స్నానము చేసిన ఫలము కలుగును.
సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 🌹 Agni Maha Purana - 118 🌹 ✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj Chapter 38 🌻 Benefits of constructing temples - 1 🌻 Agni said: 1. I wil now describe the benefits of erecting the temples of Vāsudeva and others. One who is desirous of constructing the temples of gods gets freed from sins incurred in thousand births. 2-5. Those who conceive of building a temple get the sins accrued in hundreds of births destroyed. Those who approve the building of a temple for lord Kṛṣṇa, also become free from their sins and go to the world of Acyuta (Viṣṇu). Having built a temple for Hari, a man immediately conveys a lakh of his ancestors both past and future to the world of Viṣṇu. The manes of a person who builds a temple for Viṣṇu having seen it remain in the world of Viṣṇu well-honoured and relieved of their sufferings in hells. The erection of the abode for the deity destroys sins such as the killing of a brahmin. 6. Whichever benefit could not be obtained by doing sacrificial rites, could be got by the erection of an abode (for the god). He who erects an abode for the god reaps fruits of bathing in all holy waters.
Continues.... 🌹 🌹 🌹 🌹 🌹
Comentarios