top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 119 / Agni Maha Purana - 119


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 119 / Agni Maha Purana - 119 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 38


🌻. దేవాలయ నిర్మాణ ఫలము - 2🌻


దేవతాబ్రాహ్మణాదుల రక్షణము నిమిత్తము రణభూమిలో ప్రాణాత్యాగము చేసిన వీరునకు ఏ ఫలము లభించునో ఆ ఫలము దేవాలయనిర్మాణము చేయువానికి లభించును. లోభముచే మట్టితో దేవాలయము కట్టించినవానికి గూడ స్వర్గముగాని దివ్యలోకము గాని లభించును. ఏకాయతన దేవాలయము (ఒకే దేవతా విగ్రహమునకై ఒక గది గల ఆలయము నిర్మించినవాడు స్వర్గమును పొందును. త్య్రాయతనదేవాలయమును నిర్మించినవాడు బ్రహ్మలోకములో నివసించును. పంచాయతన దేవాలయమును నిర్మించినవాడు శివలోకమును చేరును. అష్టాయతన మందిరము నిర్మించినవాడు శ్రీహరి సాంనిధ్యము నందుండును.


షోడశాయతన దేవాలయ నిర్మాణముచేసినవాడు భోగమును, మోక్షమును కూడా పొందును. శ్రీహరి దేవాలయములలో కనిష్ఠము, మధ్యమము, శ్రేష్ఠము అను మూడు శ్రేణు లున్నవి. వీటి నిర్మాణము వలన క్రమముగ స్వర్గలోక-విష్ణులోక-మోక్షములు ప్రాప్తించును.


ధనవంతుడు శ్రేష్ఠశ్రేణికి చెందిన విష్ట్వాలయమును నిర్మించుటచే ఎట్టి పలితమును పొందునో ఆ ఫలితమునే కనిష్ఠ శ్రేణికి చెందిన దేవాలయమును నిర్మించిన నిర్ధనుడు పొందును. తాను సంపాదించిన ధనములో స్వల్పధనమును మాత్రమే వెచ్చించి దేవాలయమును నిర్మించినను భక్తుడు అధిక మగు పుణ్యమును, భగవంతుని అనుగ్రహమును పొందును. ఒక లక్షగాని, ఒక వెయ్యి గాని, నూరు గాని, దానిలో సగము గాని ముద్రలను వెచ్చించి విష్ణుమందిరమును నిర్మించువాడు శ్రీ మహావిష్ణులోకమును చేరును.


బాల్యమునందు ఆట లాడుచు మట్టితో విష్ణ్వాలయమును నిర్మించినవారు కూడ విష్ణలోకమును చేరుదురు. తీర్థములందు, పవిత్రాస్థానములందు, సిద్ధక్షేత్రములందు, ఆశ్రయములందు విష్ట్వాలయమును నిర్మించువారికి ఇతర ప్రదేశము లందు నిర్మించువారికంటె మూడు రెట్లు ఎక్కువ ఫలము లభించును.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 119 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 38


🌻 Benefits of constructing temples - 2 🌻


9-17. One who builds sixteen abodes gets enjoyment and emancipation. Having built a small, medium or excellent temple for Hari one gets heaven or the world of Viṣṇu or emancipation respectively in order. Which merits a rich man would get by erecting an excellent temple of Viṣṇu, a poor man would get by (erecting) a small temple itself.


Having acquired riches and built a temple for Hari even with a small portion of it one would get excellent and enormous merits. By erecting a temple of Hari with a lakh or thousand or hundred or fifty (units of money) one would reach the place of that person who has the eagle in his banner.


Those who play in their childhood with (the building of) abodes of Hari with earth also go to the world of Vāsudeva. The building of temples of Viṣṇu at holy places, within temples, accomplished place or hermitage (yields) threefold benefit than those already described.


Continues....


🌹 🌹 🌹 🌹 🌹

Comments


Post: Blog2 Post
bottom of page