top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 120 / Agni Maha Purana - 120


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 120 / Agni Maha Purana - 120 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 38


🌻. దేవాలయ నిర్మాణ ఫలము - 3🌻


విష్ణ్వాలయమునకు వెల్లవేసినవారును, దానిపై బంధూకపుష్పముల చిత్రములు వేసినవారును విష్ణులోకమును పొందుదురు. కూలిపోయిన లేదా కూలిపోవుచున్న లేదా సగము కూలిపోయిన దేవాలయమును జీర్ణోద్ధారణము చేసినవానికి క్రొత్తదేవాలయము నిర్మించినవానికంటె రెట్టింపు ఫలము లభించును. కూలిపోయిన విష్ణ్వాంయమును మరల నిర్మించి రక్షించిన వాడు సాక్షాత్‌ భగవత్స్వరూపుడు.


భగవంతుని ఆలయము నందు ఇటుకలు ఎంతకాల ముండునో అంతవరకును, వాటిని నిర్మించినవాడు, తన కులముతో కూడ, విష్ణులోకములో నుందును. ఇహలోకమునందును, పరలోకమునందును గూడ ఆతడే పూజనీయుడు; అతడే పుణ్యవంతుడు.


శ్రీకృష్ణునకు ఆలయము కట్టించిన పుణ్యాత్ముడే పుట్టినవారిలో లెక్క. అతడే తన వంశమును రక్షించువాడు. విష్ణు-శివ-సూర్య-దేవ్యాదులకు ఆలయమును నిర్మించువాడే ఈ లోకమునందు కీర్తి పొందును. ఎంతో శ్రమపడి సంపాదించిన ధనమును, శ్రీకృష్ణాలయమును నిర్మించుటకు వినియోగింపక, కేవలము దానిని రక్షించుచుండు మూమార్ఖునకు దానివల్ల ఏమి ప్రయోజనము కలుగును?


పితరులు, బ్రాహ్మణులు, దేవతలు-వీరికై తన ధనమును వినియోగించని వాని ధనము, బంధువులకు ఉపకరించని వాని ధనము వ్యర్థము. దానమునకు గాని, భోగమునకు గాని, ధర్మాచరణమునకు గాని, కీర్తి కొరకు గాని ఉపకరించని ధనమునకు స్వామి అయి ఏమి ప్రయోజనము? అందుచే పూర్వజన్మాదృష్టముచేత గాని, పురుష ప్రయత్నముచేత గాని, మరి ఏఉపాయాంతరముచేత గాని లభించిన ధనమును ఉత్తమబ్రహ్మణులకు దానము చేయవలెను; స్థిరకీర్త లభించుటకు ఉపయోగించవలెను. దానికీర్త్యాదుకంటె గూడ దేవాలయనిర్మాణము ఉత్తమ మైనది గాన బుద్ధిమంతుడు విష్ణ్వాదిదేవతలకు ఆలయములు కట్టించవలెను.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 120 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 38


🌻 Benefits of constructing temples - 3 🌻


18. Those who decorate (the temple) of Viṣṇu with the bandhūka flowers and an oint with fragrant paste, also reach the place of the lord. (Having erected the temple of Hari), a person obtains two-fold merits after having elevated the fallen, the falling and half-fallen. He who brings about the fall of a man is the protector of one fallen.


19. By (erecting) a temple of Viṣṇu one reaches his region. As long as the bricks remain in the temple of Hari, the founder of that family is honoured in the world of Viṣṇu. He becomes pious and adorable in this world as well as the next.


20. He who builds a temple for Kṛṣṇa, the son of Vasudeva is born as a man of good deeds and his family gets purified.


21. He who builds an abode for Viṣṇu, Rudra, Sun or the goddess etc. acquires fame. What is the use of the hoarded riches for an ignorant person?


22-23. If one does not cause an abode for Kṛṣṇa to be built (with wealth) acquired by hard (work) (and) if one’s wealth could not be enjoyed by manes, brahmins, celestials and relatives, his acquisition of wealth is useless. As death is certain for a man so also the destruction of wealth.


24. One who does not spend his riches for charities or for enjoyments is stupid and is being bound even while alive, while the riches are flickery.


25. Is there any merit in being the lord of wealth acquired either accidentally or by one’s effort, if it is not spent for acquiring fame or for philanthropy?



Continues....


🌹 🌹 🌹 🌹 🌹

Kommentare


Post: Blog2 Post
bottom of page